40 ఏళ్ల తర్వాత పూరీ జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారం తెరుచుకోనుంది. కేరళలోని అనంత పద్మనాభ స్వామి మాదిరిగానే ప్రముఖ శ్రీక్షేత్రం పూరీ జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారంలో సైతం అపార సంపదలు ఉన్నాయని చెబుతుంటారు. ఎందుకోగానీ ఈ రత్న భాండాగారాన్ని 40 ఏళ్లుగా తెరవలేదు. కనీసం దీనికి సంబంధించిన తాళం కూడా ఎక్కడుందో ఎవరికీ తెలియదట. అయితే జులై 7 తర్వాత స్వామివారి ఆలయంలోని ఈ ఖజానాను తెరవనున్నట్టు పురావస్తుశాఖ బుధవారం ప్రకటించింది. దీంతో ఈ రత్న భాండాగారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అసలు దీనిలోని అంతులేని సంపద క్షేమంగా ఉందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
పూరీ జగన్నాథ ఆలయంలోని రత్నభాండాగారంలోని అంతులేని శ్రీవారి ఆభరణాలు, బంగారు, వెండి, వజ్ర వైఢూర్యాలు ఉన్నాయని అంటారు. అవన్నీ క్షేమంగా ఉన్నాయా? లేవా? అనేది ఆసక్తికరంగా మారింది. ఖజానాకు సంబంధించిన కీలక తాళం పోయి యాభై ఏళ్లు దాటిందట. అయినా కూడా అసలు ప్రభుత్వం ఈ విషయాన్నే ఎందుకు పట్టించుకోవడం లేదనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు శ్రీవారి నిధి ఉన్న గదిలోంచి బుస బుసలు వినిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇది మరింత ఆసక్తికంగా మారింది. అది వేయి పడగల ఆదిశేషునివేనంటూ ప్రచారం జరుగుతోంది. అసలు జగన్నాధుని కొలువులో ఏం జరుగుతోందనేది ఆసక్తికరంగా మారింది. దేవుడే ఇలా చేస్తున్నాడా? లేదంటే దేవుడి ఆస్తులకే మనిషి శఠగోపం పెడుతున్నాడా?అనేది చర్చనీయాంశంగా మారింది.