రామబాణం విశిష్టత.. దాని అర్థం ఏంటో తెలుసా?

శ్రీరాముడికి సంబంధించి ఆసక్తికర విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. పట్టాభిషిక్తుడు కావాల్సిన రామయ్య తండ్రి మాటను జవదాటక సీతమ్మతో కలిసి 14 ఏళ్ల పాటు వనవాసం వెళ్లాల్సి వచ్చినా కొంచెమైనా చింతించలేదు. అలాంటి గొప్ప వ్యక్తి.. సహనశీలి మన రామయ్య తండ్రి. ఇక రామబాణానికి ఎంతటి విశిష్టత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిజానికి మనం రామబాణం అంటే గురి తప్పనిదని భావిస్తుంటాం కానీ నిజానికి రామబాణం అంటే అర్థం అది కాదట.

మరి రామబాణం అంటే ఏంటి? దాని విశిష్టత ఏంటంటారా? రావణాసురుడి కుమారుడైన ఇంద్రాజిత్తుతో రాముడి సోదరుడు లక్ష్మణుడు యుద్ధం చేస్తున్నాడు. ఎన్ని బాణాలు వేస్తున్నా కూడా ఇంద్రాజిత్తు చనిపోకపోవడంతో లక్ష్మణుడు ఒక ఉపాయం ఆలోచించాడు. తన సోదరుడైన శ్రీరాముడిపై ఒట్టు పెట్టి ఆయన గురించి ఓ శ్లోకం చదివి బాణాన్ని వదిలాడట. రాముడు నిజాయితీపరుడు, పౌరుషవంతుడు, ధర్మాత్ముడు, దశరథుని కొడుకే గనుక అయితే ఈ బాణం ఇంద్రజిత్తును సంహరించుగాక అని ఆ శ్లోకం అర్థమట. బాణం ప్రయోగించగానే ఇంద్రాజిత్తు మరణించాడట. రామబాణం అంటే రాముడంతటి శక్తి కలిగి శత్రువుని సంహరిస్తుందని అర్థమట.

Share this post with your friends