తొలిసారిగా అయోధ్యలో శ్రీరామనవమి.. స్వామివారి దర్శనవేళలివే..!

అయోధ్యలో శ్రీరామనవమి కోసం అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. తొలిసారిగా అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు జరుగుతుండటంతో మరింత ప్రత్యేకత సంతరించుకుంది. అయోధ్యను శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ సర్వాంగ సుందరంగా అలంకరించింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వీఐపీ పాసులన్నీ ముందుగానే రద్దు చేసింది. నేడు శ్రీరాముడి దర్శనం కోసం ఆలయ తలుపులను 19 గంటల పాటు తెరిచి ఉంచుతారు. తెల్లవారుజామున 3.30 గంటలకు స్వామి వారికి మంగళ హారతి ఇచ్చారు. అప్పటి నుంచి బాల రామయ్యను భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు.

రాత్రి 11 గంటల వరకూ భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక కేవలం ఐదు నిమిషాల పాటు మాత్రమే అది కూడా నాలుగు భోగ నైవేద్యాల సమయంలోనే తెర మూసివేస్తారు. ఏప్రిల్ 19 వరకూ విశిష్ట అతిథులెవరికీ దర్శనం కోసం అనుమతి లేదు. వారంతా 19 తర్వాత మాత్రమే అయోధ్య రామయ్యను దర్శించుకోవాలని రామ మందిర ట్రస్ట్ ముందుగానే తెలిపింది. ఇక భక్తులకు స్వామివారి ప్రసాదాన్ని శయన హారతి అనంతరం మందిర్ నిష్క్రమణ దగ్గర అందజేస్తున్నారు. ఇవాళ మొత్తం మీద లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది.

Share this post with your friends