
పూరి జగన్నాథుడు ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ ఆలయంలో ఎన్నో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. అసలు శ్రీకృష్ణుడి లీలల గురించి తెలియనిదెవ్వరికి? ఈ క్రమంలోనే పూరి జగన్నాథుడు అస్వస్థతకు గురయ్యాడు. ఇలా ఒకసారి కాదు.. ఏటా 15 రోజుల పాటు పూరి జగన్నాథుడు అనారోగ్యానికి గురువుతూనే ఉంటాడు. ఆయన ఈ లీలను అనసార లీలగా పేర్కొంటారు. అసలు దేవుడు అనారోగ్యానికి గువడం ఏంటి? ఇలా ఎందుకు జరుగుతుంది? ఇలా జగన్నాథుడు అనారోగ్యానికి గురవడమనేది.. జీవితంలో కష్టసుఖాలుంటాయని.. దేహానికి సైతం చికిత్స అవసరమని చెప్పడమేనట.
జగన్నాథ పూరి రథయాత్ర ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఈ రథయాత్ర సాంస్కృతిక , మతపరమైన వారసత్వ గొప్పతనానికి చిహ్నం. ఈ రథ యాత్రను ఏటా జ్యేష్ఠ మాసం పౌర్ణమి రోజున జగన్నాథుని స్నాన యాత్ర పండుగని నిర్వహించారు. జ్యేష్టపౌర్ణమి నాడు జగన్నాథుడితో పాటు బలరాముడు, సుభద్రలను ఆలయం నుంచి బయటకు తీసుకుచ్చారు. ఈ స్నాన యాత్ర కోసం చేసే ప్రయాణాన్ని పహండి యాత్ర అంటారు. ఈ సమయంలో జగన్నాథుడికి స్నానం చేయించేందుకు గాన.. వివిధ తీర్థయాత్రల నుంచి 108 బంగారు పాత్రలలో నింపిన నీటిని తీసుకొస్తారు. అనంతరం సంప్రదాయబద్దంగా అర్చకులు, వేద పండితులు జగన్నాథుడికి స్నానం చేయిస్తారు. ఆ వెంటనే స్వామికి జ్వరం వచ్చి అనారోగ్యానికి గురవుతారు. ప్రస్తుతం స్వామి అనారోగ్యంతో ఉన్నాడు.
