నేటి నుంచి హయత్‌నగర్‌లో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ప్రతిష్టా మహోత్సవాలు..

హైదరాబాద్ హయత్‌నగర్‌లోని విద్యానగర్‌లో నేటి నుంచి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ప్రతిష్టా మహోత్సవాలు జరగనున్నాయి. ఇవాళ్టి (ఆగస్ట్ 7) నుంచి ఆగస్ట్ 9 వరకూ మూడు రోజుల పాటు ప్రతిష్టా మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం 9:26 గంటలకు అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమం జరుగనుంది. ఇవాళ ఉదయం 9 గంటలకు మహాగణపతి పూజ, పుణ్యహవచనం, రక్షా బంధనము, బుుత్విక్కరణము, అంకురార్పణ, యాగశాల ప్రవేశం, ప్రధాన కలశాహ్వానము, అగ్ని ప్రతిష్ట, అధివాస హోమం, మృతికస్థానం వంటి కార్యక్రమాలు జరుగనున్నాయి. ఇక ఇవాళ సాయంత్రం 6 గంటలకు గణపతి హోమం, మూర్తి హోమం, లక్ష్మీగణపతి హోమం, దుర్గా హోమం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

రెండవ రోజు ఉదయం వేదవిన్నపం, స్థాపిత పూజలు, కలశ పూజలు, అమ్మవారికి పంచామృతాభిషేకం, జలాధివాసం, చండీయాగం జరుగనున్నాయి. సాయంత్రం అమ్మవారి ఊరేగింపు, రుద్ర హోమం, దాన్యాధివాసము, ఫలాదివాసము, శయ్యాధివాసము, పుష్పనివాసము వంటి కార్యక్రమాలు జరుగనున్నాయి. మూడవ రోజు ఉదయం యంత్ర పూజలు, ఆదివాస హోమం, నవ దుర్గా హోమం జరగనున్నాయి. ఉదయం 9:26 నిమిషాలకు అమ్మవారి ప్రతిష్టాపన మహోత్సవం జరుగనుంది. అనంతరం పూర్ణాహుతి, బలిహరణం, నేత్రోన్మిలనం దృష్ణ కుంభం వంటి కార్యక్రమాలు జరుగనున్నాయి. ఇక 11వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటలకు అమ్మవారి కల్యాణాన్ని నిర్వహించనున్నారు. అనంతరం అమ్మవారికి స్థానిక మహిళలంతా బోనాలు సమర్పించనున్నారు.

Share this post with your friends