ఏపీలోని కడప జిల్లా ఒంటిమిట్టలో ఇవాళ సీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరగనుంది. శ్రీ సీతారాముల కల్యాణం సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు దీని కోసం ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సాయంత్రం 6.30 గంటల నుంచి ప్రారంభంకానున్న స్వామివారి కల్యాణంను వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. వీరికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్నప్రసాదం, తాగునీరు, మజ్జిగ అందించనున్నారు. అంతేకాకుండా స్వామివారి కల్యాణం జరిగే ప్రదేశంలో గ్యాలరీలలో కూలర్లను ఏర్పాటు చేశారు. అలాగే ఎ్కడికక్కడ ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు.
Watch Vontimitta Kodanda Rama Swamy Kalyanam LIVE
స్వామివారి కల్యాణం తరువాత భక్తులకు తలంబ్రాల ప్యాకెట్లు అందించేందుకు టీటీడీ అధికారులు సిద్ధం చేశారు. కడప నుంచి తిరుపతికి వాహనాలు ఆలంఖాన్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. అలాగే తిరుపతి నుంచి కడపకు వచ్చే వాహనాలను రేణిగుంట వద్ద దారి మళ్లిస్తున్నారు. ఈ వాహనాలన్నీ రాయచోటి మీదుగా వెళ్లాలని వాహనదారులకు సూచించడం జరిగింది. ఇలా పలు మార్గాల్లో వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ఇక కడప నుంచి 26 కిలో మీటర్లు దూరంలో ఒంటిమిట్ట ఉంది. రైలు మార్గంలో వచ్చే భక్తులు రాజంపేట రైల్వేస్టేషన్ లో దిగి బస్సులో ఒంటిమిట్టకు చేరుకోవాల్సి ఉంటుంది. తిరుపతి విమానాశ్రయం నుంచి అయితే ఒంటిమిట్ట 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.