సాధారణంగా హిందువులకు ఉదయాన్నే లేవగానే శుచిగా స్నానం చేసుకుని ఇంట్లో పూజ చేసుకోవడం అలవాటు. కొందరికి ప్రతిరోజూ ఆలయానికి వెళ్లడం అలవాటు. ఇలా వెళితే మానసిక ప్రశాంతతో పాటు అన్ని విధాలుగా బాగుంటుందని నమ్మకం. ఇలా చేస్తే దేవుడిని ఏ కోరికలు కోరినా నెరవేరుస్తాడనే నమ్మకం. అందుకే ఎక్కువగా భక్తులు ఆలయాలకు వెళతుంటారు. అయితే ఆలయానికి వెళ్లినప్పుడు పాటించాల్సిన కొన్ని నియమాలున్నాయి. శాస్త్రాల ప్రకారం కొన్ని ఆచారాలను పాటించాల్సిందే.వాటిలో ముఖ్యమైనది.. దేవుడి విగ్రహానికి ఎటువైపు నిలుచోవాలి?
ప్రతి ఒక్కరూ దేవుడిని ప్రార్థించుకునేందుకు భగవంతుడి ముందు ఉండేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. స్వామివారి విగ్రహం ముందు నిలబడితేనే ఆ భగవంతుడి కృప తమపై ఉంటుందని భావిస్తుంటారు. అయితే భగవంతుడి విగ్రహానికి సూటిగా నిలబడకూడదు. స్వామివారికి ఎడమ లేదంటే కుడి వైపున నిలబడి ప్రార్థించుకోవాలి. అప్పుడే దేవతావిగ్రహాల నుంచి వెలువడే ‘‘దైవకృపా శక్తి’’ తరంగాల రూపంలో ప్రవహిస్తూ, భక్తుని దగ్గరకు చేరుకుంటుంది. స్వామివారి విగ్రహానికి ఎదురుగా నిలబడితే ఆ దివ్యకిరణాలను తట్టుకోవడం కాస్త అసాద్యమట. కాబట్టి స్వామివారికి కుడి లేదంటే ఎడమ వైపున నిలబడి ప్రార్ధించాలట.