ఆ రెండూళ్లకు ఒక్కడే దేవుడు.. నిత్య పూజలు ఓ ఊరిలో.. రామయ్య కల్యాణం మరో ఊరిలో..

సాధారణంగా గ్రామం అన్నాక గుడి పక్కాగా ఉంటుంది. అందునా రాముడి గుడి పక్కాగా ఉంటుంది. కానీ ఆ రెండూళ్లకు మాత్రం ఒక్కడే దేవుడున్నాడు. ఒక గ్రామంలో నిత్య పూజలు.. మరో గ్రామంలో బ్రహ్మోత్సవాలతో పాటు స్వామి వారి కల్యాణం జరుగుతూ ఉంటుంది. మరి ఆ రెండూళ్ల దేవుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా? తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో ఉన్నాయి. అయితే ఆ రెండు గ్రామాలు మాత్రం వేర్వేరు మండలాల్లో ఉన్నాయి. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామం.. కేతేపల్లి మండలం బండపాలెంలో ఈ గ్రామాలున్నాయి.

సీతారామ చంద్రస్వామి ఆలయమైతే చందుపట్ల గ్రామంలో ఉంది. ఇక్కడ స్వామివారికి నిత్య పూజలు జరుగుతుంటాయి. స్వామివారి కల్యాణం మాత్రం బండపాలెంలోని గుట్టపై నవమి రోజున స్వామివారి కల్యాణం జరుగుతుంది. కాబట్టి ఈ రామయ్య రెండూళ్ల దేవుడని పిలుస్తుంటారు. భద్రుడు, సారంగుడనే రుషులు 17వ శతాబ్దంలో తపస్సు చేశారు. భద్రుడు తపస్సు చేసిన ప్రాంతం భద్రాద్రిగానూ.. సారంగుడు తపస్సు చేసిన ప్రాంతంగా సారంగచలంగానూ స్థిరపడిపోయింది. ఇక ఇక్కడి గుహ అంతర్భాగంలో శ్రీరామచంద్రస్వామి వెలిశాడు. అందుకే ఆయనను సారంగజల రాముడని పిలుస్తారు. అయితే ఇది అటవీ ప్రాంతం కావడంతో వెలమదొరలు స్వామి వారి నిత్య పూజల కోసం చందుపట్ల గ్రామాన్ని నిర్మించారు. కాబట్టి చందుపట్ల ఆలయంలో ఏడాదంతా పూజలు నిర్వహిస్తారు. ఇక శ్రీరామనవమి ముందు స్వామివారిని పల్లకిలో బండపాలెం గ్రామంలోని గుట్ట పైకి తీసుకెళ్లి బ్రహ్మోత్సవాలతో పాటు శ్రీరామనవమి నిర్వహిస్తారు.

Share this post with your friends