ఇవాళ ఆదివారం కావడంతో తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. ఇక తిరుమలలో కీలక నిర్ణయాల దిశగా ఈవో జే శ్యామలరావు అడుగులు వేస్తున్నారు. లడ్డూ ప్రసాదం విషయంలోనూ మునుపటి రుచిని తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. నాణ్యమైన నెయ్యిని తెప్పించాలని సూచనలు చేశారు. అలాగే దళారీ వ్యవస్థ నిర్మూలనకు సైతం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడికక్కడ సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా నిర్ణయం తీసుకుంటున్నారు. ఇక తిరుమలలో జూలైలో కూడా విశేష ఉత్సవాలు జరగనున్నాయి.
జూలైలో తిరుమలలో విశేష ఉత్సవాలు
జూలై 2న మతత్రయ ఏకాదశి
జూలై 11న మరీచి మహర్షి వర్ష తిరునక్షత్రం
జూలై 15న పెరియాళ్వార్ శాత్తుమొర
జూలై 16న శ్రీవారి ఆణివార ఆస్థానం
జూలై 17న తొలి ఏకాదశి
జూలై 21న గురు పూర్ణిమ, వ్యాస పూజ
జూలై 22న శ్రీ విఖనస మహాముని శాత్తుమొర
జూలై 31న సర్వ ఏకాదశి