ఆంజనేయ స్వామి జయంతి అనగానే అందరికీ గుర్తొచ్చేది నెట్టికంటి ఆంజనేయ స్వామి. ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ఇది వెలుగొందుతోంది. ఈ ఆలయానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలివస్తుంటారు. కన్నడంలో నెట్టె అంటే నేరుగా అనిఅర్థం. నెట్టెకంటి అంటే నేరుగా చూసే కన్ను కలిగిన అని అర్థం. అందుకే ఈయనను నెట్టికంటి ఆంజనేయ స్వామి అని పిలుస్తారు. ఈ స్వామివారి జయంతి ఉత్పవాలు నాలుగు రోజులుగా జరుగుతున్నాయి. ఇవాళ స్వామివారి జయంతి కాబట్టి మరింత వైభవంగా నిర్వహిస్తున్నారు.
రేపటితో నెట్టికంటి ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాలు ముగియనున్నాయి. ఈ ఐదు రోజుల పాటు వివిధ రకాల అలంకరణలతో స్వామివారు కన్నుల పండువగా దర్శన మిస్తారు. నేడు వివిధ రకాల పండ్ల నడుమ స్వామివారు కనువిందు చేస్తున్నారు. అలాగే స్వామివారికి నేడు 108 కలశాలతో అభిషేక సేవ నిర్వహించనున్నారు. హనుమాన్ జయంతి కావడంతో నేడు ఈ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఈ స్వామివారి ఆలయానికి 500 ఏళ్ల చరిత్ర ఉంది. నిన్న ఉదయం స్వామివారిని ద్రాక్ష, గోడంబి, ఖర్జూరం, చెర్రీ, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్‌తో అలకరించారు. అనంతరం సుందరకాండ పారాయణం, మన్య సూక్త హోమం నిర్వహించారు.