అక్షయ తృతీయ రోజున వీరికి బంగారం కొన్నా.. కొనకున్నా కలిసొస్తుందట..

ఈ నెల 10న అంతా అక్షయ తృతీయ పర్వదినాన్ని జరుపుకోబోతున్నాం. అయితే అందరికీ ఏమో కానీ ఈ పండుగ నుంచి కొన్ని రాశుల వారికి అయితే బంగారం కొన్నా కొనకున్నా బీభత్సంగా కలిసొస్తుందట. 9, 10 తేదీల్లో చంద్రుడు వృషభ రాశిలో ప్రవేశించి ఉచ్ఛ పట్టడమే కాకుండా.. అదే రాశిలో సంచరిస్తున్న గురు గ్రహంతో కలిసి గజకేసరి యోగం ఏర్పడనుంది. ఈ కారణంగా మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారికి అక్షయ తృతీయ నుంచి మరింత యోగ కాలం ప్రారంభం కానుంది. ఈ రాశుల వారికి ఏ విధంగా కలిసొస్తుందో చూద్దాం.

మేషం: ఈ రాశికి అక్షయ తృతీయ నాటి నుంచి బీభత్సమైన ధన యోగం, భాగ్య యోగాలు పడతాయట. ఆ రోజున మహాలక్ష్మీ పూజ చేయడంతో బంగారం, వెండి వంటి వాటిని కొనుగోలు చేయడం వల్ల వీరికి అనేక శుభ యోగాలు కలుగుతాయి. ఏ పని చేసినా కూడా శుభమే కలుగుతుందట.

వృషభం: ఈ రాశి వారికి అక్షయ తృతీయ నుంచి ఆర్థిక వృద్ధి కావల్సినంత ఉంటుందట. వివాదంలో ఉన్న ఆస్తి సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. కుటుంబలోని స్త్రీలకు వస్త్రాలు, విలువైన వస్తువులు కొనడమో.. గిఫ్ట్‌గా ఇవ్వడమో చేస్తే తప్పక ఆర్థికంగా కలిసొస్తుందట.

కర్కాటకం: ఈ రాశివారికి అక్షయ తృతీయ రెండు మూడు రోజుల కాలంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా పక్కాగా ఏమాత్రం ఇబ్బంది లేకుండా పూర్తవుతుందట.

కన్య: ఈ రాశికి ఆకస్మిక ధన లాభం జరిగే అవకాశం ఉందట. ఒకటికి రెండు సార్లు కూడా ఆర్థికంగా కలిసొచ్చే అవకాశం ఉందట. విదేశాల నుంచి శుభవార్తలతో పాటు విదేశీ సొమ్ము అనుభవించే అవకాశం అంది వస్తుంది.

వృశ్చికం: ఈ రాశివారికి రావలసిన సొమ్ము చేతికి అందడం, బాకీలన్నీ వసూలు కావడం వంటివి తప్పకుండా జరుగుతాయి. వీరు ఆర్థికంగా ఓ స్థాయికి వెళతారట.

మకరం: ఈ రాశివారి ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలన్నీ సకాలంలో విజయవంతంగా పూర్తయి ఆర్థిక లాభం కలుగుతుంది.

Share this post with your friends