తిరుమల ఏడు కొండల్లో అంజనాద్రి, వృషభాద్రి ఏ శక్తికి ప్రతీకలంటే..

తిరుమల ఏడు కొండలు శక్తికి ప్రతీకలని తెలుసుకున్నాం కదా. మొదటి మూడు కొండలు ఏ ఏ శక్తికి ప్రతీకలో తెలుసుకున్నాం. కుండలిని శక్తి మణిపురి చక్రాన్ని తాకితే 60 శాతం సాధన నిర్వహించినట్టు అని తెలుసుకున్నాం కదా. ఇంకొంచెం సాధన చేస్తే సాధకుని కుండలిని శక్తి అనాహత చక్రాన్ని తాకుతుంది. ఇప్పటికి సాధకుడికి నూటికి 80% సాధించినట్లు. ఇప్పటికి సాధకుడికి స్థూల శరీర స్పృహ తగ్గుతుంది. శరీరం చాల తేలిగ్గా, గాల్లో తేలిపోతున్నట్లు ఉంటుంది. సాధకుడు వాయుపుత్రుడైన ఆంజనేయుడే అవుతాడు. అందుకే నాలుగవ కొండకి.. అంజనాద్రి అని పేరు.

తిరుమల ఏడు కొండల్లో నాలుగవ కొండ వృషభాద్రి. ఈ కొండ ఏ శక్తికి ప్రతీకో చూద్దాం. సాధకుడు ఇంకొంచెం ధ్యానం చేస్తే అతని కుండలిని శక్తి విశుద్ధ చక్రాన్ని తాకుతుంది. ఇప్పటికి సాధకుడికి నూటికి 100% సాధించినట్లు. అప్పుడు మనకు భగవంతుడు కనిపిస్తూ ఉంటాడు. ఆ తరువాత సంసార చక్రాలన్నీ దాటేస్తాడు, అన్ని బంధాలు విడిపోతాయి. ప్రాణ నియంత్రణ శక్తి వస్తుంది. ఇంక పరమాత్మ వైపు పరిగెడుతూ ఉంటాడు. ఎద్దుకి అచ్చు వేసి వదిలేస్తే ఎలా దాని ఇష్టం వచ్చినట్లు పరిగెడుతుందో అలా పరమాత్మ వైపు పరిగెత్తుతాడు. అందుకే ఐదవ కొండకి.. వృషభాద్రి అని పేరు.

Share this post with your friends