భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన ఆలయాలు చాలా ఉన్నాయి. అందుకే బారత్‌ను దేవభూమిగా పిలుస్తూ ఉంటారు. భారత్‌లోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించడానికి ప్రపంచం నులమూలల నుంచి ప్రజలు భారత్‌కు వస్తుంటారు. ఇక దేశంలో ప్రముఖ ఆలయాల్లో తిరుమల వేంకటేశ్వర స్వామివారి ఆలయం, అన్నవరం సత్యనారాయణ స్వామి, పూరి జగన్నాథ ఆలయం, కశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయం, అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం, కాణిపాకం సిద్ధి వినాయక ఆలయం, కేరళలోని గురువాయూర్, అయప్ప స్వామి ఆలయాలు, షిర్డీ సాయినాథుని ఆలయం ప్రపంచ ప్రసిద్ధి గాంచాయి.
అయితే ఆలయాల్లోని ప్రసాదం విషయానికి వస్తే కొన్ని ఆలయాల్లోని ప్రసాదాలు మాత్రమే అద్భుతంగా ఉంటాయి. తిరుపతి, అన్నవరం ప్రసాదాల గురించి మనందరికీ తెలుసు. తిరుమల లడ్డూ అంత రుచికరమైన ప్రసాదం ప్రపంచంలోనే ఉండదంటే అతిశయోక్తి కాదు. అయ్యప్ప స్వామి ప్రసాదం అద్భుతంగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఇక పూరి జగన్నాథ ఆలయంలో ప్రసాదంగా ఖిచ్డీ, పప్పులు, కూరగాయలు, స్వీట్లు ఉంటాయి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో లంగర్ అనే ప్రసాదం ఉంటుంది. అది చాలా రుచిగా ఉంటుంది. గురువాయూర్‌లో పాలతో చేసిన అన్నం, పాలు, పంచదారతో చేసిన పాయసాన్ని ప్రసాదంగా ఇస్తారు. ఇది అమృతంలా ఉంటుంది.