శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతమని.. సత్యనారాయణ స్వామి వ్రతమని చేస్తూ ఉంటాం. ఇవి చేయలేని వారు.. ఒకే ఒక్క మంత్రాన్ని నిత్యం పఠించుకుంటే చాలు.. మన జీవితంలో అద్భుతమైన మార్పు కనిపిస్తుందట. ఇంతకీ అదేం మంత్రం అంటారా? లింగాష్టక మంత్రం. భోళా శంకరుడైన శివుడిని ఆరాధిస్తే చాలు.. మనకు చాలా మంచి జరుగుతుందని నమ్మకం. శివ పురాణం ప్రకారం శివలింగాన్ని బిల్వ పత్రంతో పూజిస్తే చాలా మంచిది. ఆయనకు బిల్వ పత్రమంటే చాలా ఇష్టం కాబట్టి శివయ్య ప్రత్యేక అనుగ్రహాన్ని పొందుతారు.
ఇక లింగాష్టక స్తోత్రాన్ని పఠిస్తే జీవితంలో అద్భుతమైన మార్పులు కనిపిస్తాయట. అలాగే ఈ మంత్రాన్ని భక్తితో ప్రతిరోజూ జపిస్తే ఎనిమిది రకాల దోషాలు తొలగిపోయి శివయ్య అనుగ్రహం లభిస్తుందట. ఇక ఆ మంత్రం ఏంటంటే.. ‘‘అష్టదళోపరివేష్టిత లింగం సర్వసముద్భవ కారణ లింగమ్ | అష్టదరిద్ర వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగమ్||’’ ఈ మంత్రాన్ని పఠిస్తే జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయట. మన జీవితంలోని ఎనిమిది రకాల దు:ఖాలతో పాటు పేదరికం కూడా తొలగిపోతుందట.