విశ్వేశ్వరుడిని తమ ఇంట వివాహానికి ఆహ్వానించిన నీతా అంబానీ.. రూ.2.5కోట్ల విరాళం

ముఖేష్ అంబానీ ఇంట త్వరలో పెళ్లి భాజాలు మోనున్నాయి. ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహం జరుగనుంది. ముఖేష్ అంబానీ ఇంట ఏ శుభకార్యం జరిగినా కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే తమ ఇంట పెళ్లి సందర్భంగా ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ వారణాశికి చేరుకుని కాశీ విశ్వనాథ దేవాలయంలో శివయ్యకు పూజలు చేసి ఆదిదంపతుల కుటుంబం మొత్తాన్ని తమ ఇంట వివాహానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విశ్వనాథుని ఆలయానికి కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు.

అనంతరం కాశీ విశ్వనాథ్ ధామ్‌కు నీతా అంబానీ రూ.1.51 కోట్లు విరాళంగా ఇచ్చారు. దీంతో పాటు ప్రాంగణంలోని విశాలాక్షి శక్తి పీఠాన్ని, అన్నపూర్ణదేవి ఆలయాన్ని దర్శించుకున్నారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలను నీతా అంబానీ నిర్వహించి తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. అన్నపూర్ణ ఆలయానికి కోటి రూపాయలను విరాళంగా ఇచ్చారు. గంగా హారతిలో సైతం నీతా అంబానీ పాల్గొన్నారు. అదొక దివ్య అనుభవంగా ఆమె అభివర్ణించారు. గంగమ్మను సైతం తమ ఇంట వివాహ మహోత్సవానికి ఆహ్వానించారు.

Share this post with your friends