తిరుమల ఏడు కొండలలోని మొదటి మూడు కొండల పరమార్థం ఏంటంటే..

కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి గుర్తుకు రాగానే.. మనకు ఏడుకొండలు గుర్తొస్తాయి. తిరుమల ఏడుకొండలకు ఆధ్యాత్మికమైన పూర్వ చరిత్రలు అయితే ఉన్నాయి. ఈ ఏడుకొండలకు బ్రహ్మ స్థానముగా భావిస్తుంటారు. ఈ ఏడుకొండలను భక్తులు నడుస్తూ ఎక్కి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఈ ఏడుకొండలలో ఒక్కొక్క కొండలో ఒక్కో రహస్యం దాగి ఉందని చెబుతారు. ఈ ఏడు కొండలను సప్త మహారుషులని అంటారు. అసలు మొదటి మూడు కొండలలో ఉన్న పరమార్థం ఏంటి? ఆ మూడు కొండలు ఎక్కితే ఏం జరుగుతుందో చూద్దాం.

1. వృషభాద్రి: ఏడుకొండలలో వృషభాద్రి మొదటికొండ. వృషభం అంటే ఒక ఎద్దు. పరమేశ్వరుడి వాహనం. ఆ ఎద్దుకు మూడు పాదాలుంటాయంటారు. అవి భూత, భవిష్యత్, వర్తమాన కాలాలని చెబుతారు. ఈ కొండను ఎక్కితే వేద ప్రమాణాన్ని అంగీకరించినట్టట.

2. వృషాద్రి: వృషం అంటే ధర్మం. తిరుమల కొండలలోని రెండవ కొండను ఎక్కిన వాడు ధర్మబద్దమైన పనులను నిర్వర్తించినట్టుగా భావించబడతాడు.

3. గరుడాద్రి: గరుడ అంటే పక్షి. ఉపనిషత్తుల జ్ఞానాన్ని సొంతం చేసుకోవడం అని అర్థమట. తిరుమల గిరులలోని మూడవ కొండ అయిన గరుడాద్రిని ఎక్కితే భగవంతుడి గురించి తెలుసుకుంటాడట.

Share this post with your friends