దాన చేయడం వలన కలిగే ప్రయోజనం తెలుసుకున్నాం. బలి చక్రవర్తి గురించి కూడా కొంత మేర తెలుసుకున్నాం. గత జన్మలో అతడు నాస్తికుడని.. వేశ్యాలోలుడని తెలుసుకున్నాం. అలాంటి బలి చక్రవర్తి మూడడుగులు శ్రీ మహా విష్ణువుడికి దానమిచ్చి పాతాళ లోకానికి అధిపతి అయిపోయాడు. అలాంటి బలి చక్రవర్తి గత జన్మ వృత్తాంతమేంటో తెలుసుకుందాం. బలి చక్రవర్తి దరిద్రుడే అయినా వేశ్యాలోలుడట. ఒకసారి వేశ్యా సంగమానికి వెళ్లేందుకు సిద్ధమై తాంబూలం, సుగంధ ద్రవ్యాలూ, శ్రీ చందనం, కర్పూరం, మల్లె పూలూ ఇత్యాది భోగ వస్తువులను ఒక సంచీలో పెట్టుకొని వేశ్యా వాటికకి బయల్దేరాడు.
వేశ్యావాటికకు వెళుతుండగా బలి చక్రవర్తి కాలు జారడంతో మార్గమధ్యంలోనే కింద పడిపోయాడట. అప్పుడు ఆయన తలకు బలమైన గాయం తగిలిందట. దీంతో ఆయన మూర్చపోయాడు. ఆ సమయంలో అతనికి ఒక విచిత్రమైన ఊహ కలిగింది. తన దగ్గరున్న ఈ పరిమళ ద్రవ్యాలన్నీ శివుడికి నివేదన చేస్తున్నట్టు ఆయనకు ఊహ కలిగిందట. ఆ సమయంలోనే అతను ప్రాణాలు విడిచాడట. కేవలం ఆ ఊహ కరాణంగానే అతనికి చాలా పుణ్యఫలం కలిగిందట. భటులు ఆయన్ను నరకానికి తీసుకెళ్లారట. చివరి నిమిషంలో పరమేశ్వరుడికి నివేదిస్తున్నట్టు ఊహించాడు కాబట్టి మూడు ఘడియల పాటు ఇంద్ర పదవిని చేపట్టాల్సి ఉందని చెప్పాడట.