బంగారు పళ్లెంలో చిత్రం గీసిన శివుడు.. తర్వాత ఏం జరిగిందంటే..

తమిళనాడులోని తేని నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో మధురై-కొచ్చి జాతీయ రహదారిపై బోడినాయకనూర్ వెళ్ళే మార్గంలో కొడంగిపట్టిలో ఉన్న చిత్రగుప్తుడి ఆలయం గురించి తెలుసుకున్నాం కదా. అసలు చిత్ర గుప్తుడి చరిత్రేంటో తెలుసుకుందాం. ఇప్పటి వరకూ చాలా మంది దేవుళ్ల చరిత్ర గురించి తెలుసు కానీ చిత్ర గుప్తుడి గురించి చాలా మందికి దాదాపుగా తెలియదు. శివుడి ఆజ్హ లేనిదే చీమైనా కుట్టదని అంటారు. అలాంటి శివయ్యే ఒకప్పుడు ఈ ప్రపంచంలోని జీవుల చర్యలన్నింటినీ నమోదు చేయాలనుకున్నాడట.

అనుకున్నదే తడవుగా ఆ పని ఎవరికి అప్పగించాలని పార్వతి దేవిని అడిగాడట. అప్పుడు పరమేశ్వరుడు ఓ బంగారు పళ్లేన్ని తీసుకుని దానిలో ఒక బొమ్మ గీశాడట. ఆ చిత్రం పార్వతి దేవిని ఎంతగానో ఆకట్టుకుంది. శివపార్వతుల దైవానుగ్రహంతో చిత్రం కాస్తా ఒక దేవుడిగా మారిందట. ఆ దేవుడికి భూలోకంలో ఉన్న మానవులందరి కర్మలను లిఖించే బాధ్యతను మహేశ్వరుడు అప్పగించాడు. చిత్రమంటే తెలిసిందే.. గుప్త అంటే రహస్యం. ఒక చిత్రం నుంచి గుప్తంగా ఉద్భవించినందున అతను చిత్రగుప్తుగా పేరుగాంచాడు. ఆ తరువాత యమ ధర్మ రాజుకి మంత్రిగా చిత్ర గుప్తుడు నియమించబడి మనుషుల పాప కర్మలను లిఖిస్తున్నాడట.

Share this post with your friends