అత్యంత సాహసోపేతమైన కిన్నౌర్ కైలాష్ యాత్ర గురించి తెలుసా?

కిన్నౌర్ కైలాష్ యాత్ర గురించి తెలుసా? ఇది కూడా అత్యంత సాహసోపేతమైన ఆధ్యాత్మిక యాత్ర. కిన్నౌర్ కైలాష్ అనేది భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కిన్నౌర్ జిల్లాలో సముద్ర మట్టానికి 6050 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక పర్వతం. మానస సరోవర్, అమర్‌నాథ్ యాత్రల కంటే ఇది చాలా క్లిష్టమైన యాత్ర. అసలు ఈ ప్రయాణం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఈ యాత్ర చేసుకుంటే వచ్చే ఫలితమేంటి? అసలు ఇక్కడ ఏం ఉంటుంది? తదితర విషయాలపై ఓ లుక్కేద్దాం.

కిన్నౌర్ కైలాష్ యాత్ర ఇప్పటికే ప్రారంభమైంది. ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి అంటే ఈ రోజు నుంచి ఆగస్టు 26 వరకూ ఈ యాత్ర జరగనుంది. కిన్నౌర్ కైలాష్ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ జూలై 25 నుంచే ప్రారంభమైంది. యాత్రికులు ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో ఏ విధంగానైనా నమోదు చేసుకోవచ్చు. ఈ యాత్రను జీవితంలో ఒకసారైనా పూర్తి చేయాలని అంటారు. ఇలా పూర్తి చేస్తే వ్యక్తి మరణానంతరం మోక్షాన్ని పొందుతాడు. ఈ యాత్ర కుటుంబంలోని ఒక్కరు చేసినా కూడా ఆ ఫలితాన్ని ఫలితాన్ని అనేక తరాలు అనుభవిస్తాయట.

Share this post with your friends