ఒక జీవుడు తన జీవితములో అనుభవించవలసిన ప్రారబ్ధకర్మను, ఒక ఫతకము ప్రకారము పుట్టినపుడే నిర్ణయించి ఉండడమును, జాఫతకము అంటారు కదా! ఆ జాఫతకము పండ్రెండు విధములుగా విభజింపబడి ఉంటుంది. విభజింపబడిన జాఫతకములోని ప్రారబ్ధము, పండ్రెండు భాగములుగానున్న కర్మచక్రములో ఉంటుంది. ఎవని కర్మచక్రము వాని తలలో ఉంటుంది. తల మధ్యభాగములో ఫాలభాగమున (నుదుటి భాగమున) గల నాలుగు చక్రముల సముదాయములో, క్రిందినుండి రెండవ చక్రము కర్మచక్రమై ఉంటుంది. కర్మచక్రములోని ప్రారబ్ధకర్మను జీవితకాలములో మనిషి చేత అనుభవింప చేయునవి గ్రహములు. గ్రహములు కూడా కర్మ చక్రమును ఆనుకొని, పైనగల కాలచక్రములో గలవు. పుట్టిన సమయములో గల జాఫతకము ద్వారా మనిషి జీవిత ప్రారబ్ధమును తెలుసుకోవచ్చని చెపుతారు కదా! జాఫతకములో కర్మ ప్రత్యక్షముగా కనిపించదు. జాఫతకములో ప్రత్యక్షముగ గ్రహములు కనిపిస్తాయి. కాలచక్రములోని గ్రహములను చూచి, వాటి ద్వారా అవి పాలించు ప్రారబ్ధమును తెలుసు కోవచ్చును. అందువలన జ్యోతిష్యములో ఇటు గ్రహములు, అటు కర్మ ఆచరణ (ఆచారము) అను రెండు భాగములు ఉంటాయి. రెండిటిని కలిపి గ్రహచారము (గ్రహచారణ) అంటారు. ఎవని గ్రహచారము ఎట్లుందో, వాని కాల, కర్మచక్రములను బట్టి తెలియును. కాలచక్రము పండ్రెండు భాగములు విభజింపబడి పండ్రెండు పేర్లుంటాయి. వాటిని క్రింద 1వ చిత్రపటరూపములో చూడండి.
కాలచక్రము -1వ పటము
1) మేషము 2) వృషభము 3) మిథునము 4) కర్కాటకము 5) సింహము 6) కన్య 7) తుల 8) వృశ్చికము 9) ధనస్సు 10) మకరము 11) కుంభము 12) మీనము.
ఈ పండ్రెండు కాలచక్రభాగములలోనున్న గ్రహములు నిర్ణీతమైన వేగముతో గతి తప్పక ప్రయాణించుచూ తమ కిరణములను కర్మచక్రము మీద ప్రసరింపజేస్తుంది. ఇపుడు చక్రముల వివరము పూర్తిగా తెలుసుకొందాము. ప్రతి మనిషి తలలో బ్రహ్మ,కాల, కర్మ, గుణచక్రములను నాలుగు చక్రముల సముదాయము గలదు. ఈ నాలుగు చక్రముల సముదాయము విశ్వములోని జీవులందరికీ ఆధారమైయున్నది. ఈ నాల్గుచక్రముల సముదాయము తెలియకపోతే మనిషికి దైవజ్ఞానము ఏమాత్రము తెలియదని చెప్పవచ్చును. నాల్గు చక్రములు అటు బ్రహ్మవిద్య లోనూ (ఆధ్యాత్మిక విద్యలోనూ), ఇటు జ్యోతిష్యశాస్త్రములోనూ ప్రాధాన్యత కల్గియున్నవి. ఈ నాల్గుచక్రముల వివరము కూలంకషముగా తెలియాలంటే త్రైతసిద్ధాంత భగవద్గీతలోని, అక్షర పరబ్రహ్మయోగమను అధ్యాయమును చదవండి. అక్కడే మన శరీరములోని నాల్గుచక్రముల వివరము తెలియగలదు. ఈ నాల్గుచక్రముల వివరము తెలియకపోయిన దానివలన, ఇటు బ్రహ్మవిద్యాశాస్త్రమైన ఆధ్యాత్మికములోనూ, అటు కర్మ విధానమైన జ్యోతిష్యరంగములోనూ మనుషులు వెనుకబడిపోయి యున్నారు. నాల్గు చక్రములంటే ఏమిటి? అవి ఎక్కడున్నవి? అని తెలియనంత వరకు సంపూర్ణమైన దైవ జ్ఞానమునుగానీ, సంపూర్ణమైన జ్యోతిష్యమునుగానీ తెలియలేము. కళ్ళు లేనివానికి దృష్టి ఏమాత్రములేనట్లు, బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రముల వివరము తెలియని వానికి జ్ఞానదృష్టి ఏమాత్రముండదు. ప్రతి శరీరములో నుదుటి భాగమున లోపల గల నాల్గు చక్రముల సముదాయమును తర్వాత పేజీలోని 2వ చిత్రపటమునందు చూడండి.
బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రము – 2వ పటము
పై నుండి రెండవ చక్రమే కాలచక్రము. కాలచక్రము గుండ్రముగా వుండి పండ్రెండు భాగములు కల్గియుండగా, కొందరు జ్యోతిష్యులు దానికి ‘జాతకచక్రమనీ’ లేక ‘జాతకకుండలియనీ’ పేరుపెట్టి చతురస్రముగ చిత్రించు కొన్నారు. దానికి ‘లగ్నకుండలియని’ పేరుకూడా పెట్టారు. లగ్నకుండలి, జాతకకుండలి, జాతకచక్రము అనబడు కాలచక్రము యొక్క చతురస్రముగా నున్న చిత్రమును తర్వాత పేజీలోని 3వ చిత్రపటమునందు చూడండి.
కాలచక్రము – 3వ పటము
కాలచక్రమును జ్యోతిష్యులు పై విధముగా చతురస్రముగా చిత్రించుకొన్నారు. విచిత్రమేమంటే మేష, వృషభ మొదలగు పండ్రెండు భాగములుగా గీచుకొన్నది కాలచక్రమని వారికి తెలియదు. దానిని లగ్నకుండలి అంటున్నారు తప్ప, అది తలలోని కాలచక్రమని తెలుసు కోలేకపోయారు. అంతేకాక తలలో కర్మచక్రమొకటున్నదనీ, దానికి ఒక ఆకారమున్నదనీ ఇప్పటి జ్యోతిష్యులకు తెలియదు. కర్మ అయిన పాపపుణ్యములను తెలియకుండ, కేవలము ప్రపంచ కష్ట సుఖములనూ, వస్తు వాహనములనూ, ధన కనకములనూ, స్థిర చరాస్తులను, పుత్ర, కళత్రముల ఫలితముల గురించి చెప్పుచున్నారు. వాటిని కూడా లగ్నకుండలి నుండియే చూస్తున్నారు. కర్మ చక్రమనునది ప్రత్యేకముగా ఉన్నదని వారికి తెలియదు. ఏ పండ్రెండు భాగములలో గ్రహములను చూస్తున్నారో, అదే లగ్నములలోనే ఫలితములను చూస్తున్నారు. దీనిని బట్టి కాల, కర్మచక్రముల గురించి తెలియదని అర్థమగుచున్నది. వాటి వివరము తెలియకనే, పూర్వము ఎవరో చెప్పిన పండ్రెండు లగ్నముల పేర్లను మాత్రము జ్ఞాపకము పెట్టుకొని చెప్పుకొనుచున్నారు. అందువలన నేటి జ్యోతిష్యము గాడి తప్పినదై పోయినది. దానివలన జ్యోతిష్యము శాస్త్రము కాదేమోనని కొందరు అంటున్నారు, కొందరు మూఢనమ్మకమనీ, కొందరు శాస్త్రముకాదనీ అంటున్నారు. జ్ఞానజ్యోతి కల్గినవారై మన శరీరములోనే, శిరస్సుయందు కాల, కర్మ అను రెండు చక్రములున్నవని తెలిసి, కాలచక్రములో గ్రహములు, కర్మచక్రములో పాప పుణ్యములున్నాయని తెలిస్తేనే జ్యోతిష్యము గాడిలో పడుతుంది మరియు ఇది శాస్త్రమని తెలియబడుతుంది. ఇపుడు తలలోని నాల్గుచక్రముల సముదాయములోని కర్మచక్రమును గురించి వివరించు కొందాము. నాల్గు చక్రములలో క్రిందినుండి రెండవచక్రము కర్మచక్రముగా ఉన్నది. కర్మచక్రమును తర్వాత పేజీలోగల 4వ చిత్రపటమునందు చూడండి.
కర్మచక్రము – 4వ పటము
పై చక్రము బాగా అర్థమగుటకు కర్మచక్రమును కూడా చతురస్రా కారములో గీచి చూచుకోవచ్చును. కాలచక్రమునకు పేర్లు గలవు, కానీ కర్మచక్రమునకు పేర్లుండవు. కర్మచక్రములోని భాగములను అంకెలతోనే గుర్తుంచుకోవాలి. ఇందులోని మొదటి భాగమును ప్రథమ స్థానము అంటాము. మిగతా భాగములను వరుసగా రెండవ భాగమును ద్వితీయ స్థానము, మూడవ భాగమును తృతీయస్థానము, నాల్గవ భాగమును చతుర్థస్థానము, ఐదవ భాగమును పంచమస్థానము, ఆరవభాగమును షష్టమస్థానము, ఏడవ భాగమును సప్తమస్థానము, ఎనిమిదవ భాగమును అష్టమస్థానము, తొమ్మిదవ భాగమును నవమస్థానము, పదవభాగమును దశమస్థానము, పదకొండవ భాగమును ఏకాదశస్థానము, పండ్రెండవ భాగమును ద్వాదశస్థానము అని అంటున్నాము. కర్మచక్రమునూ, దాని భాగములనూ చతురస్రాకారములో చూపుతూ, అందులో కర్మ భాగములను కూడా చూపు చిత్రమును క్రిందగల 5వ పటమునందు చూడండి.
కర్మచక్రము – 5వ పటము