వైఎస్ఆర్ జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మే 21 నుంచి తెప్పోత్సవాలు ప్రారంభం కానున్నారు. ఈ నెల 23వ తేదీ వరకు జరగనున్నాయి. స్వామి, అమ్మవార్లు ఆలయ పుష్కరిణిలో ప్రతి రోజు రాత్రి 7 గంటలకు తెప్పలపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు. రెండు రోజుల పాటు జరిగే తెప్పోత్సవాల్లో భాగంగా శ్రీ కృష్ణ సమేత గోదాదేవి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారు తెప్పలపై తిరుగుతూ భక్తులకు కనువిందు చేయనున్నారు.
మే 21న శ్రీ కృష్ణ సమేత గోదాదేవి మూడు చుట్లు, మే 22న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారు ఐదు చుట్లు, మే 23న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారు ఏడు చుట్లు తెప్పలపై తిరిగి కనువిందు చేయనున్నారు. ఈ మూడు రోజుల పాటు ఉదయం 10 నుంచి 11 గంటల వరకూ స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 నుంచి 6.30 గంటల వరకూ తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి.