జూలై ఆన్లైన్ భక్తి పత్రిక వెలువడింది.. ఇక ఆలస్యం చేయకుండా కోనేయండి..!

వానలు కురుస్తున్నాయి. ఎటుచూసినా పచ్చని ప్రకృతి. ఈ కాలంలో పొంచివున్న మహమ్మారులను తరిమికొట్టడానికి తెలంగాణ ప్రజలు అత్యంత భక్తిశ్రద్దలతో అమ్మతల్లికి బోనాలు సమర్పిస్తుంటారు. వ్యాధుల నుంచి రక్షించి, పంటపొలాలను కాపాడమని జగన్మాతను వేడుకుంటారు. గోల్కొండలో 7వ తేదీన జగదంబిక బోనాలు ప్రారంభమవుతాయి. నెత్తిపై బోనం కుండలతో నడిచే మహిళలు, పోతరాజుల విన్యాసాలతో బోనాల పండుగ వాతావరణం శోభస్కరంగా ఉంటుంది. బోనాలు అందుకునే అమ్మతల్లులు మనందరినీ చల్లంగా చూడాలని వేడుకుందాం. ప్రతి ఆషాఢంలో జనసంద్రంగా సాగే పూరీ జగన్నాథ రథోత్సవం (జూలై 7, 8) దేశానికే పర్వదినం. ఈ ఉత్సవంలో దర్శనమిచ్చే జగన్నాథుడు భక్తకోటి మొదలు ఆలకించాలని కోరుకుందాం. దక్షిణాయన వేళలో తొలి ఏకాదశి (17) ప్రధానపర్వం. అటుపైన గురుపూర్ణిమ (జూలై 21) వస్తుంది. గురువంటే మన సంప్రదాయంలో సాక్షాత్తూ పరమాత్మయే. మన గురుపరంపరను సంస్మరిస్తూ వారికి అంజలి ఘటించడం మన సంస్కారం. మహనీయులు, మాన్యులు అయిన పీఠాధిపతులు చాతుర్మాస్య దీక్షలను గురుపూర్ణిమ రోజునే ప్రారంభిస్తారు. వారి దీక్షలు లోకమాత కృపతో ప్రశాంతంగా సాగాలని, లోకశ్రేయస్సుకు దోహద పడాలని కోరుకుందాం.

Click Here For July 2024 Bhakthi Magazine Online Edition

ఇంటింటా ధర్మజ్యోతిగా భక్తిపత్రికను ప్రారంభించి తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. ఇది మన పత్రికకు 10వ జన్మదిన సంచిక. 2015లో గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తిటీవీకి అనుబంధంగా భక్తిపత్రికను ప్రారంభించాం. ఇంతకాలంగా భక్తిపత్రిక అశేష పాఠకాదరణ పొందుతూ, అప్రతిహతంగా ముందుకు సాగుతుంది. కరోనా సమయంలో కూడా క్రమం తప్పకుండా పత్రికను వెలువరించాం. భారతీయ ధర్మం, తత్త్వచింతన, మహనీయుల మహితోక్తులతో పాటు ఆయా ఆయా పండుగలు, ఆలయాలపై విశిష్ట వ్యాసాలతో భక్తిపత్రికను తీర్చిదిద్దుతున్నాం. భక్తిపరిమళాలు వెదజల్లేలా, ఆధ్యాత్మిక చింతనను పెంచేలా ఎన్నెన్నో వైవిధ్యభరితమైన శీర్షికలను నిర్వహిస్తున్నాం. ఎన్నో నేడు పత్రికలు పుట్టి కొద్దికాలానికే కనుమరుగవుతున్న పరిస్థితుల్లో భక్తిపత్రికను అప్రతిహతంగా కొనసాగిస్తూ సకాలంలో పాఠకదేపుళ్లకు చేరుపపుతున్నాం. ఈ క్రతువులో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని నిలబడుతున్నాం. ఆధ్యాత్మిక పత్రికలలో భక్తిపత్రిక నేడు అగ్రస్థానంలో కొనసాగడానికి పాఠకులు, ప్రచురణకర్తల సహాయ సహకారాలే కారణం. మీ ఆదరాభిమానాలు ఇలాగే చిరకాలం కొనసాగాలని కోరుకుంటున్నాం.

ఆ నో భద్రాః క్రతవో యన్తు విశ్వతః
సద్భావనలు సర్వదిక్కుల నుంచి సంప్రాప్తించు గాక!

ఇలా అనేక అంశాలతో జూలై ఆన్లైన్ భక్తి పత్రిక వెలువడింది. కొన్న వారికి తక్షణమే తమ DASHBOARD లోకి పత్రిక వచ్చేస్తుంది. అందులోని పర్వదినాలను సద్వినియోగం చేసుకోండి. మన సేవలను అందుకుని ఆ దేవతలందరూ మనందరికీ ఆయురారోగ్యాలను, సకల శుభాలను కలిగించాలని వేడుకుందాం.

ఇక్కడ క్లిక్ చేయండి.. జూలై ఆన్లైన్ భక్తి పత్రికను పొందండి..!

Share this post with your friends