ఉదయాన్నే ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే.. రోజంతా అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి ఉదయాన్నే లేవగానే అసలేం చూస్తే మన మనసుకు ఆనందంగా.. ఉల్లాసంగా ఉంటుందో చూడాలి. పొద్దులే లేవగానే హిందువులు ఉదయించే సూర్యుడిని చూసి సూర్య నమస్కారం చేసుకుంటారు. సూర్య నమస్కారం చేసుకుని.. ఆదిత్య పారాయణం చేస్తే మనసుకు ఉల్లాసంతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుందంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉదయించే సూర్యుడిని చూడటం, నమస్కరించడం వలన ఆ రోజంతా మనం పాజిటివ్ ఎనర్జీతో పని చేస్తుంటాం. ఇక సూర్యుడితో పాటు మనం ఉదయాన్ని ఏం చూడాలి? ఏం చేయాలనేది కూడా ముఖ్యమే.
ఉదయాన్నే ఆకాశంలో పక్షులు స్వేచ్ఛగా విహరిస్తుంటాయి. అలాగే అవి చేసే శబ్దాలు కూడా మన మనసుకి ఆనందం కలుగజేస్తాయి. అలాగే ఉదయం లేవగానే వికసించే పువ్వులను చూడటం వలన కూడా మనకు చాలా శుభప్రదంగా అనిపిస్తుంది. ఉదయాన్నే ఆకాశం నీలిరంగులో కనిపిస్తూ ఉంటుంది. దీనిని చూస్తే మనసుకు సాంత్వన లభిస్తుంది. సప్తవర్ణాల ఇంద్రధనస్సును చూస్తే మనసుకు చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. అయితే ఇది అన్ని వేళలా సాధ్యపడదు. వీలైతే మాత్రం తప్పక చూడాలి. సీతాకోక చిలుకలు మంచి శకునానికి ప్రతీకలుగా భావిస్తారు. కాబట్టి ఉదయాన్నే వీటిని చూస్తే మంచి జరుగుతుందట. అలాగే నేల మీద పడిన నాణెం కూడా అదృష్టానికి సంకేతంగా భావిస్తారు.