తులసి మొక్కకు వీటిని సమర్పిస్తే ఫలితం చాలా బాగుంటుందట..

తులసి మొక్కను హిందువులంతా లక్ష్మీదేవిగా భావించి పూజిస్తూ ఉంటారు. ఉదయాన్నే ముందుగా తులశమ్ము పూజ చేసుకున్నాకే పచ్చి గంగైనా ముట్టని వారు చాలా మందే ఉన్నారు. తులసిని పూజిస్తే విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందట. అసలు పూజ సమయంలో ఏ వస్తువులను పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందో తెలుసుకుందాం. ముఖ్యంగా గురువారంతో పాటు శుక్రవారం తులసికి పచ్చి పాలను సమర్పిస్తే మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు. అలాగే నిత్యం తులసికి నీటిని సమర్పించడంతో పాటు చెరుకు రసాన్ని నైవేద్యంగా సమర్పిస్తే ప్రయోజనాలను పొందవచ్చు.

ముఖ్యంగా ప్రతి నెల పంచమి తిథి రోజున తులసికి చెరకు రసం నైవేద్యంగా సమర్పిస్తే మరిత ప్రయోజనం చేకూరుతుంది. ఇలా చేస్తే ఎలాంటి కష్టం నుంచైనా మనల్ని బయట పడేయడంతో పాటు మన ఇంట ఆనందం, శ్రేయస్సు నెలకొంటాయట. అలాగే తుశమ్మకు ఎరుపు రంగు చునారితో పాటు అలంకరణ వస్తువులను సమర్పించినా కూడా ఫలితం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని నమ్మకం. ఇక తులశమ్మకు నీటిని సమర్పించేందుకు రాగి లేదా ఇత్తడి కుండను ఉపయోగించాలట. అయితే ఆదివారం, ఏకాదశి నాడు మొక్కకు నీటిని సమర్పించకూడదట.

Share this post with your friends