సోమవారం ఈ పనులు చేయకుండటమే ఉత్తమం..

హిందూమతంలో సోమవారాన్ని పరమేశ్వరుడికి అంకింతం చేయడం జరిగింది. ఇక ఇది మరొకరికి కూడా అంకితం ఇవ్వబడింది. వారెవరంటే.. చంద్రుడు. సోమవారం నాడు శివుడితో పాటు చంద్రుడిని కూడా పూజిస్తూ ఉంటే మనం సుఖశాంతులతో జీవిస్తామని నమ్మకం. అయితే మనం సోమవారం నాడు చేయకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటంటే.. సోమవారం రోజున శివునికి పాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది. కానీ పొరపాటున కూడా ఎవరికీ పాలు లేదా తెల్లని వస్త్రాలు దానం చేయకూడదు. ఇక ఇవాళ ఏ పని చేయాలనుకున్నా ముందుగా రాహుకాలం రాహుకాలం చూసుకుని మాత్రమే చేయాలి. లేదంటే అడ్డంకులు తప్పవు.

ఇవాళ కొన్ని దిక్కుల వైపునకు ప్రయాణాలు కూడా చేయకూడదట. దీనిని దిశ శూలం అని అంటారు. ఇవాళ ముఖ్యంగా తూర్పు దిశలో అత్యవసరమైతే తప్ప ప్రయాణించకూడదు. అలాగే ఆగ్నేయ మూలకు వెళ్లకూడదు. ఉత్తరం వైపునకు కూడా వెళ్లకుంటే మంచిది. ఇక నేడు చంద్రుడికి ఇష్టమైన రంగు తెలుపు కాబట్టి తెలుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఈ క్రమంలోనే నలుపు, నీలం, గోధుమ మొదలైన ముదురు రంగు దుస్తులను ధరించకుంటేనే మంచిది. శివారాధన సమయంలోనూ తెలుపు రంగు దుస్తులు ధరించాలి. శివారాధనలో శంఖం, తులసి, మొగలి పువ్వులను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించవద్దు. అభిషేకానికి రాగి పాత్రను కూడా వినియోగించకూడదు.

Share this post with your friends