పిల్లలు కానీ పెద్దలు కానీ కాస్త డల్ అయినా.. తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడినా దిష్టి తగిలిందని అంటూ ఉంటాం. వెంటనే వారికి దిష్టి తీసేస్తాం. అసలు నిజంగానే దిష్టి ఉంటుందా? అంటే శాస్త్రీయంగా నిరూపించడం కాస్త కష్టమే కానీ దిష్టి అనేది మాత్రం కచ్చితంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. చూపులకు మహత్తరమైన పవర్ ఉంటుందని అంటున్నారు. నరుని దిష్టికి నల్లరాయి అయినా పగులుతుంది అంటారు కదా. పైగా ఆలయానికి వెళ్లినా కూడా నీ చల్లని చూపు మాపై ఉండాలని భగవంతుడిని వేడుకుంటూ ఉంటాం. అంటే చూపుకు పవర్ ఉన్నట్టే కదా అని వాదిస్తున్నారు.
కంటికి భావాలను ప్రకటించే శక్తి ఉన్నట్టే భావాలు బాగా తీక్షణమైతే అవి స్పటికీకరణ చెందే అవకాశం ఉంది. అటువంటప్పుడు దానిని ఎలా తీయాలో తెలుసుకోవాలి. ప్రతి మనిషి శరీరం చుట్టూ జీవ అయస్కాంతపు పొరలు కొన్ని ఉంటాయట. ఈ చూపుల వల్ల బయట ఉండే అయస్కాంత పొరల్లో చిరాకు ఏర్పడుతుంది. దీనినే దిష్టి అంటారట. దీనిని ఉప్పుతో తొలగించాలట. ఎందుకంటే మన శరీరంలో అత్యధికంగా ఉన్న ఖనిజ లవణం ఉప్పే కాబట్టి దేనినైనా మనం ఉప్పు ద్వారా మాత్రమే స్వీకరించగలమట. చెడు సూచికలన్నింటినీ ఉప్పు తీసేస్తుందట. కాబట్టి ఉప్పుతో దిష్టి తీసి.. ఎవరూ తొక్కని చోట లేదంటే ప్రవహించే నీటిలో వేయాలట.