చెట్టు చాటు నుంచి చంపడం న్యాయమా? అన్న వాలి ప్రశ్నకు రాముని సమాధానమేంటంటే..

రామాయణం ఎంత విన్నా అద్భుతంగా అనిపిస్తుంది. మంచి చెడులను పక్కన పెడితే ప్రతి ఒక్క క్యారెక్టర్‌కూ ఓ ప్రత్యకత అయితే ఉంటుంది. వాలి, సుగ్రీవుల గురించి అందరికీ తెలిసిందే. అయితే అందరిలోనూ ఒక ప్రశ్న అయితే ఉంటుంది. అంతటి ధర్మబద్దుడైన శ్రీరామచంద్రుడు వాలిని ఎందుకు చెట్టు చాటు నుంచి చంపాల్సి వచ్చింది? అని. నిజమే కదా.. రాముడు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకుడు. ఆయన చూపిన బాట నేటికీ ఆదర్శం అలాంటి రాముడు ఎందుకలా చేయాల్సి వచ్చింది? అంటే సుగ్రీవుడు ఎంత ఉత్తముడో.. వాలి అంత హీనుడు. చూడటానికి ఇద్దరూ ఒకేలా ఉంటారు. అదే వాలికి ప్లస్.. సుగ్రీవుడికి మైనస్ అయ్యింది. ఇష్టానుసారంగా వాలి పాపాలను చేయడం సుగ్రీవునిపై మోపడం పరిపాటిగా మారింది.

ఒకరోజు సుగ్రీవుడిని బాగా కొట్టి అతని భార్యను వాలి అపహరించాడు. దీంతో సుగ్రీవుడు అవమానాన్ని భరించలేక రాజ్యాన్ని వదిలి వెళ్లిపోయి ఋష్యమూక పర్వతంపై నివాసాన్ని ఏర్పరుచుకున్నాడు. సీతాన్వేణలో భాగంగా వానరులు సహా రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతం పైకి వెలతారు. అప్పుడు సుగ్రీవుడు తన బాధనంతా రాముల వారికి వివరిస్తాడు. వాలిని జయించడం అంత సులభమైన పని కాదని రాముడికి చెప్పడంతో రాములవారు ఒకే ఒక్క బాణంతో ‘సప్తతాళశ్రేణి’ని (ఏడు తాటిచెట్ల వరుస) కూల్చేస్తాడు. రాముడు ఎంతటి బలవంతుడో తెలుసుకుని.. ధైర్యంగా వెళ్లి సుగ్రీవుడిని వాలి యుద్ధానికి పిలుస్తాడు. వాలి, సుగ్రీవుల మధ్య భీకర యుద్ధం జరుగుతుండగా.. చెట్టు చాటు నుంచి రాముడు బాణం వేయగా వాలి సొమ్మసిల్లి పడిపోతాడు. అనంతరం ‘చెట్టు చాటు నుంచి ఇలా దాడి చేయడం న్యాయమా’ అని రాముడిని వాలి ప్రశ్నించగా.. తమ్ముడిని కొట్టి.. అతని భార్యను అపహరించుకుపోవడం న్యాయమా? అని రాముడు ప్రశ్నిస్తారు. అప్పుడు తన తప్పు తెలుసుకున్న వాలి.. రాముడి వంటి మహోన్నత వ్యక్తి చేతిలో మరణించడం తన అదృష్టంగా భావించి తుది శ్వాస విడుస్తాడు.

Share this post with your friends