నెట్టింకటి ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణం వెనుక ఆసక్తికర కథ..

సమస్త భూత, ప్రేత, దుష్ట గ్రహ పీడలన్నీ ఈ హనుమంతుడిని దర్శించుకుంటే మాయమవుతాయట. అది మరేదో కాదు. నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయం. ఏపీలోని అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో కసాపురం అనే గ్రామంలో ఉంది. ఈ స్వామిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ ఆలయ చరిత్రేంటంటే.. సా.శ.1521 ప్రాంతంలో తుంగభద్ర నది ఒడ్డున శ్రీ వ్యాసరాయలవారట. ఆ సమయంలో తాను ధరించిన గంధంతో ఒక రాయిపై ఆయన ఆంజనేయ స్వామివారి రూపాన్ని చిత్రించేవారట. ఆసక్తికరంగా అలా చిత్రించిన ప్రతిసారీ హనుమంతుడు తన నిజ రూపం ధరించి అక్కడి నుంచి వెళ్లిపోయేవాడట.

విషయాన్ని గమనించిన వ్యాసరాయల వారు.. హనుమంతుడిని ఎటూ వెళ్లనివ్వకుండాకుండా యంత్రం తయారు చేసి దాని లోపల స్వామివారి నిజరూపాన్ని చిత్రించారట. దీంతో స్వామివారు అక్కడే ఉండిపోయారట. ఒకరోజు కర్నూలులోని శ్రీ భోగేశ్వర స్వామి వారి ఆలయంలో ఒకరోజు వ్యాసరాయలు నిద్రిస్తుండగా ఆంజనేయ స్వామి కలలో వచ్చి తానున్న ప్రాంతం చెప్పి గుడి కట్టించాలని చెప్పారట. ఆ ప్రాంతమేంటని అడగ్గా.. అక్కడి నుంచి దక్షిణం వైపున వెళితే ఒక ఎండిన ఒక వేప చెట్టు కనిపిస్తుందని.. దాని సమీపానికి వెళితే అది చిగురిస్తుందని అక్కడ తానుంటానని చెప్పారట. అక్కడకు వెళ్లి చూసి వ్యాసరాయలు ఆప్రాంతంలో తవ్వించగా ఒంటి కన్ను ఆంజనేయ స్వామి విగ్రహం కనించింది. వెంటనే రాయలవారు ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి.. ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి ఈ ఆలయంలో స్వామిని నెట్టికంటి ఆంజనేయ స్వామిగా ప్రతిష్ఠించి పూజించడం మొదలుపెట్టారు.

Share this post with your friends