తెలంగాణ, కాశీలోని ఈ దేవాలయాల్లో దేవుడికి మద్యం, మాంసమే నైవేద్యం

హిందువులు నిత్యం దేవుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. దేవుడిని పూజించే విషయంలో ప్రాంతాన్ని బట్టి ఆచారాలుంటాయి. పూజా విధానం, నైవేద్యంగా సమర్పించే ఆహార పదార్ధాలు ఒకొక్క దేవుడికి ఒకొక్క రకంగా ఉంటుంది. పులిహోర, చక్కెర పొంగలి, శనగలు వంటి రకరకాల ఆహార పదార్ధాలను దేవుడికి ప్రసాదంగా ఇస్తారు. అయితే కొన్ని దేవాలయాలు దీనికి భిన్నంగా ఉంటాయి. మద్యం, మాంసం వంటి వాటిని దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. తిరిగి వాటిని భక్తులకు ప్రసాదంగా పంచుతారు. ఏ దేవాలయాల్లో మద్యాన్ని ప్రసాదంగా ఇస్తారో తెలుసుకుందాం..

కాల భైరవుడికి, కొన్ని శక్తి ఆలయాల్లో మాంసం, మ‌ద్యం స‌మ‌ర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటారు. తెలంగాణలోని చింతలకుంట ఆంజనేయ స్వామి వారికి మద్యం, మాంసాన్ని నైవేద్యంగా సమర్పించి తిరిగి దానిని భక్తులకు ప్రసాదంగా అందిస్తారు. బహుశా ఈ ఒక్క హనుమాన్ ఆలయంలో మాత్రమే ఈ విధమైన ప్రసాదం ఉంటుంది. ప్రపంచంలో అత్యంత పురాతన నగరం.. శివయ్య కొలువుండే క్షేత్రం వారణాసిలో విశ్వనాథుడు, అన్నపూర్ణ, విశాలాక్షి సహా అనేక ఆలయాలు ఉన్నాయి. కాశిలోనే బాబా బతుక్ భైరవ ఆలయం. ఈ గుడికి ఒక ప్ర‌త్యేక‌త ఉంది. ఈ బాబా బతుక్ భైరవ స్వామి ద‌ర్శ‌నానికి వెళ్ళే భక్తులు పిల్ల‌లైతే బిస్కెట్లు, చాక్లెట్లు స‌మ‌ర్పిస్తారు. పెద్దలు మాంసం, మ‌ద్యం స‌మ‌ర్పించి మొక్కులు చెల్లించుకుంటారు.

Share this post with your friends