సాయంకాలం వేళ శివపార్వతులు, విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఏం చేస్తారంటే..

ప్రదోష కాలం అంటే సూర్యాస్తమయానికి ముందు 1.5 గంటలు.. తర్వాత 1.5 గంటల (మొత్తం 3 గంటలు) సమయంలో శివపార్వతులు, లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఏం చేస్తూ ఉంటారో తెలుసా? పరమేశ్వరుడు ప్రదోష కాలంలో తాండవం చేస్తూ ఉంటాడని పురాణ వచనం. ఈ సమయంలో పార్వతీదేవి బంగారు సింహాసనంపై ఆసీనురాలై ఉంటుందట. లక్ష్మీదేవి పాట పాడుతూ ఉంటే శ్రీ మహావిష్ణువు మద్దెల వాయిస్తూ ఉంటాడు. మొత్తం త్రిమూర్తులు అందరూ ఈ ప్రదోష కాలంలో ఒకేచోట ఉంటారని చెపుతారు.

సాయంకాలం వేళ శివపార్వతులు, విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఏం చేస్తారంటే..
సాయంకాలం వేళ శివపార్వతులు, విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఏం చేస్తారంటే..

కావున ఈ ప్రదోషకాలంలో శివుని నామాన్ని స్మరించినా ఆయనకి పూజాభిషేకాలు నిర్వహించినా మహా పుణ్యమనీ.. మనోభీష్టాలు నెరవేరుతాయనీ చెప్పబడుతోంది. అందువలన మహా శివరాత్రి రోజున ఉపవాస, జాగారాలు చేయాలనే నియమాన్ని పాిస్తూ ప్రదోష కాలంలో శివుని ఆరాధించాలి. ఒకవేళ ఏ సందర్భంలోనైనా మహా శివరాత్రి నాడు చేయాలనుకున్న పనులు చేయలేకపోయినా ఈ పన్నెండు మాస శివరాత్రులలో ఏ శివరాత్రికైనా ఈ పనులు చేయడం వలన మంచి ఫలితాలను పొందుతారు.

Share this post with your friends