శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. నేడు ఆర్జిత సేవా టికెట్ల విడుదల

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. ఆగస్టు నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఇవాళ విడుదల చేయనుంది. ఇవాళ ఉదయం 10 గంటలకు ఆగష్ట నెలకు సంభందించిన ఆర్జిత సేవా టిక్కేట్లను ఆన్ లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు పవిత్రోత్సవాల టిక్కేట్లను విడుదల చేయనుంది. ఆపై మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టిక్కెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఆగస్ట్ నెలలో స్వామివారికి ఆర్జిత సేవ చేయాలనుకునే భక్తులు ఇవాళ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

టికెట్లు పొందాలనుకునే భక్తులు ఆన్‌లైన్‌లో ముందుగానే నమోదు చేసుకోవాలని టీటీడీ సూచించింది. నమోదు చేసుకున్న వారందరికీ ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా ఆర్జిత సేవా టికెట్లను కేటాయిస్తారు.శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ సహా వివిధ సేవలను ఉపయోగించుకోవాలనుకునే భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవాల‌ని టీటీడీ కోరింది. నేటి ఉద‌యం 10 గంట‌ల‌కు శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాతో పాటు శ్రీ‌వారి ఆల‌యంలో ఆగ‌స్టు 15 నుంచి 17వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న వార్షిక ప‌విత్రోత్స‌వాల సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

Share this post with your friends