గుడిలోకి వెళ్లగానే ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూసి మనసు తేలిక పడుతుంది. ఒక్కో గుడిలో దేవుడు ఒక్కో రూపంలో ఉంటాడు. అయితే ఇక్కడి గుడిలో మాత్రం దేవుడు పాదుకల రూపంలో ఉంటాడు. ఎవరా దేవుడు? ఎందుకు పాదుకల రూపంలో ఉంటాడు? తదితర విశేషాలు చూద్దాం. దయ్యాల గురించి వినడమే కానీ అవి ఉన్నాయో లేదో మనకు తెలియదు. అయితే కర్నాటక రాష్ట్రంలోని కల్బూర్గి గానుగాపూర్ ఆలయంలో దయ్యాలను వదిలించడం, ఆత్మలలను బంధించడం, చేతబడులు తొలగించడం వంటివి మనం ప్రత్యక్షంగా చూడవచ్చట. అందుకే దీనిని ఆధ్మాత్మిక స్వర్గంగా భావిస్తారు.
గానుగాపూర్. దత్తాత్రేయుని దేవాలయం. ఇక్కడ దేవుడు పాదుకల రూపంలో ఉంటాడు. ఈ ఆలయంలో ప్రతి రోజూ పాదుకలకు అభిషేకం జరుగుతూ ఉంటుంది. అభిషేకం ముగిసిన వెంటనే పాదుకలను పూలు, వస్త్రాలతో కప్పేస్తారు. అంటే భక్తులకు పాదుకా దర్శనం ఉదయం 9 గంటల వరకూ మాత్రమే ఉంటుందట. ఆ లోపు అయితే భక్తులు పాదుకలను దర్శించుకోవచ్చు. ఈ ఆలయ ప్రాంగణంలో ప్రతి గురువారం రాత్రి పల్లకీ ఉత్సవం నిర్వహిస్తారు. ఇక ఈ గానుగపూర్ క్షేత్రం కర్నాటక రాష్ట్రంలోని గుల్బార్గా జిల్లా కేంద్రానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది.