సొంతింటి కల నిజం కావాలంటే ఈ స్వామివారిని దర్శించుకోవాల్సిందే..

లవకుశులు శ్రీరామునితో యుద్ధం చేసిన భూమి.. చెన్నైలోని శిరువాపురి.ఈ శిరువాపురిలో కొలువైన భగవంతుడే శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ స్వామవారిని పూజిస్తే మన కోరికలు తప్పక నెరవేరుతాయని నమ్మకం. ముఖ్యంగా ఈ స్వామివారికి మొక్కితే తప్పక సొంతింటి కల నెరవేరుతుందట. చేతిలో డబ్బు అన్నీ ఉన్నా కూడా కొన్ని సార్లు సొంతింటి కల నెరవేరడం కష్టంగా ఉంటుంది. అటువంటి వారు శిరువాపురికి వెళ్లి స్వామివారిని మొక్కుతారు. ఇక అంతే వెంటనే కోరిక నెరవేరుతుందట. చెన్నై నుంచి రెడ్ హిల్స్ లేదా కారనొడై లేదంటే మీంజూర్, పొన్నేరి మార్గం ద్వారా శిరువాపురి చేరుకోవచ్చు.

పంటపొలాల పచ్చదనం మధ్యలో శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర కొలువు దీరాడు. శిరువాపురి ఆలయంలో ఎన్నో ఉపాలయాలు ఉన్నాయి. రాజగణపతి, అరుణాచలేశ్వర్, అభిత కుచలాంబాల్, సూర్యుడు, చండీకేశ్వరుడు, నాగస్వామి, ఆదిమూలవర్, నవగ్రహాలు, కాలభైరవుడు, అరుణ గిరి నాథర్, మయూర నాథర్ వంటి స్వాములకు ప్రత్యేక సన్నిధానాలు ఉన్నాయి. ఇక ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే.. గర్భగుడిలోని సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం మినహా.. మిగిలిన అన్నీ విగ్రహాలు మరకత పచ్చరాతితో చేసినవి. ఇక గర్భాలయంలోని సుబ్బయ్య స్వామి నాలుగున్నర అడుగుల ఎత్తు ఉంటాడు. సొంత ఇల్లుతో పాటు ఇతర ఇంటి సంబంధిత సమస్యలు, భూ వివాదాలు పరిష్కారం కావాలంటే శిరువాపురిని సందర్శించుకోవాల్సిందే.

Share this post with your friends