పాప విమోచన ఏకాదశి నాడు వైష్ణవ ఆలయాలను దర్శిస్తే ఏం జరుగుతుందంటే..

పాపమోచని ఏకాదశి అంటే పేరులోనే ఉంది కదా. పాపాలను నాశనం చేస్తుంది. తెలిసీ తెలియక మనం ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాం. వాటి నుంచి మనకు విముక్తిని కలిగిస్తుందట. ఈ రోజున వైష్ణవాలయాలను దర్శిస్తే వెయ్యి ఆవులను దానం చేసినంత ఫలితం ఉంటుంది. ఈ సంవత్సరం పాపమోచని ఏకాదశిని ఈ నెల 25న నిర్వహించుకోనున్నాం. పాప విమోచని ఏకాదశి ప్రాధాన్యత ఏంటంటే.. శ్రీ మహా విష్ణువుతో పాటు ప్రసన్నం చేసుకోవడానికి ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటారు. దీని వలన వ్యక్తి చేసిన పాపాల నుంచి విముక్తి పొందడంతో పాటు మోక్షం లభిస్తుందట.

అలాగే ఈ రోజున ఉపవాసం చేస్తే జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుందట. పాపమోచని ఏకాదశి రోజున ఉపవాసం ఉండటంతో పాటు, లక్ష్మీనారాయణులను కూడా నిర్మల హృదయంతో పూజించాలి. అలాగే పూజ అనంతరం పాపమోచని ఏకాదశి ఉపవాస కథను కూడా చదవడమో లేదంటే వినడమో చేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సిరి సంపదలు శ్రేయస్సు ఎల్లప్పుడూ ఉంటుందని నమ్మకం. పాపమోచని ఏకాదశి నాడు కొందరు తీర్థయాత్రలు సైతం చేస్తారు. ఇలా చేయడం వలన వెయ్యి గోవులను దానం చేయడం వలన వచ్చే పుణ్యం కంటే ఎక్కువ పుణ్యం పొందుతాడు.

Share this post with your friends