దక్షిణ భారతదేశంలో ఆరు ప్రసిద్ధమైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు ఉన్నాయి. అందులో తిరుత్తణి ఒకటి. ఈక్షేత్రం అత్యంత మహిమాన్వితమైనదిగా భక్తులు భావిస్తూ ఉంటారు. మనం ఏదైనా పోగొట్టుకుంటే.. ఈ తిరుత్తణి క్షేత్రాన్ని దర్శించుకుంటే తప్పక తిరిగి పొందుతామట. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది? అనే విషయాలను తెలుసుకుందాం. బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతులు తిరుత్తణిని దర్శించి సుబ్రహ్మణ్యుడికి పూజ చేసి తారకాసురుడి కారణంగా పోగొట్టుకున్న శంఖు, చక్రాలను తిరిగి పొందారట. అలాగే బ్రహ్మ కూడా తాను పోగొట్టుకున్నది సైతం పొందారట.
స్వర్గలోకాధిపతి అయిన దేవేంద్రుడు ఈ క్రేత్రంలో ఒక అరుదైన పూల మొక్కను నాటాడట. ఈ మొక్కకు ప్రతిరోజు మూడు పుష్పాలు పూసేవట. వాటితో సుబ్రహ్మణ్యుడిని పూజిన తారకాసురాది రాక్షసుల ద్వారా పోగొట్టుకున్న సంఘనీతి, పద్మనీతి, చింతామణి మొదలైన దేవలోక ఐశ్వర్యాన్ని తిరిగి పొందాడని ప్రతీతి. అలాగే బ్రహ్మ దేవుడిని ప్రణవ అర్థము చెప్పలేకపోయాడని కుమారస్వామి బంధిస్తాడు. దీంతో బ్రహ్మ సృష్టి చేసే సామర్థ్యాన్ని కోల్పోయాడట. అప్పుడు తిరుత్తనిలో ఉన్న కార్తికేయుని పూజించాడట. ఆ తరువాతే తన శక్తి సామర్థ్యాలను తిరిగి పొందాడని పండితులు చెబుతారు. అందుకే అఖండ ఐశ్వర్యాలు కావాలన్నా.. చేజార్చుకున్నవి తిరిగి పొందాలనుకున్నా ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే చాలట.