ఈ ఆలయాలను దర్శిస్తే తప్పక మోక్షం లభిస్తుందట..

చావు, పుట్టుకలనేవి మనిషి చేతుల్లో ఉండదేమో కానీ మోక్ష మార్గం మాత్రం మనిషి చేతిలోనే ఉంటుందట. మరి మోక్షం పొందాలంటే ఏం చేయాలి? జీవితంలో ఒక్కసారైనా కొన్ని ఆలయాలను సందర్శిస్తే మోక్షం తప్పక లభిస్తుందని అంటారు. మరి అవేంటో చూద్దాం. మనకు మోక్షాన్ని ప్రసాదించే ఆలయాల్లో బద్రీనాథ్‌ ఆలయం ఒకటి. ఇది ఉత్తరాఖండ్ హిమాలయాల్లో ఉంది. చార్దామ్ యాత్రలో భాగంగా ఈ ఆలయాన్ని సైతం దర్శిస్తూ ఉంటాం. ఈ ఆలయాన్ని దర్శిస్తే మోక్షం లభిస్తుందట.

ఇక మనం మోక్షాన్ని అందించే ఆలయాల్లో శ్రీకృష్ణ పరమాత్ముడి ద్వారక కూడా ఒకటి. దీనిని శ్రీకృష్ణుడు పాలించాడు. ద్వారకకు సంబంధించిన ఆనవాళ్లు కూడా లభించాయి. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇక్కడ కృష్ణుడి ఆలయంలో విగ్రహానికి మ్యాగ్నెటిక్ పవర్ ఉందట. అనంతరం మనకు మోక్షాన్ని అందించే ఆలయాల్లో తమిళనాడులోని రామేశ్వరం కూడా ఒకటి. శివుడు కొలువైన ఈ ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇక ఒరిస్సాలోని జగన్నాథుని సన్నిధి కూడా మోక్షాన్ని అందిస్తుందట. ఇక్కడ జరిగే రథయాత్ర దేశంలోనే ప్రసిద్ధి గాంచింది. ఈ ఆలయాలను దర్శిస్తే తప్పక మోక్షం లభిస్తుందని నమ్మకం.

Share this post with your friends