ఆ ఆలయంలో హనుమంతుడిని సంకెళ్లతో ఎవరు బంధించారో తెలిస్తే..?

భారతదేశంలో హిందూ దేవాలయాలకు పుట్టినిల్లు వంటిది. కొన్ని వందల ఏళ్ల నాటి ఆలయాలు సైతం ఇక్కడ ఉన్నాయి. అలాంటి ఓ చారిత్రక దేవాలయమే ఒడిస్సాలోని పూరి జగన్నాథ స్వామి దేవాలయం. ఈ క్షేత్రంలోనే హనుమంతుడి ఆలయం కూడా ఉంది. దీనిని దారియా మహావీర క్షేత్రమని పిలుస్తారు. ఈ ఆలయంలో హనుమంతుడు సంకెళ్లతో బంధించబడి ఉంటాడు. అసలు హనుమంతుడిని సంకెళ్లతో ఎవరు బంధించారు? ఎందుకు బంధించాల్సి వచ్చింది? వంటి విషయాలు తెలుసుకుందాం.

పూరీక్షేత్రంలో జగన్నాథుడు వెలిసిన అనంతరం ఆయన దర్శించుకోవాలని సముద్రుడు ఆలయానికి వచ్చాడట. సముద్రుడి రాకతో ఆలయంతో పాటు ఊరంతా జలమయమైందట. దీంతో తమను రక్షించమని జగన్నాథుడిని ప్రజలు ప్రార్థించగా.. జగన్నథుడు ప్రత్యక్ష్యమై ఆ ఆలయానికి రక్షకుడిగా హనుమంతుడిని ఉంచాలనుకున్నారట. హనుమంతుడి కోసం ఆరా తీయగా ఆయన అయోధ్యకు వెళ్లినట్టు తెలిసిందట. దీంతో కోపోద్రిక్తుడైన జగన్నాథుడు హనుమంతుడిని అక్కడకు రప్పించి.. ఇక ముందు ఎక్కడకూ కదలకూడదని సంకెళ్లతో బంధించాడట. ఈపై క్షేత్రంలోకి సముద్రుడు రాకుండా కాపాలా కాయాలని ఆదేశించాడట. దారియా అంటే సముద్రం.. సముద్రం నుంచి ప్రజలను రక్షిస్తాడు కాబట్టి ఆ హనుమంతుడికి దరియా మహావీర అని పేరు వచ్చింది.

Share this post with your friends