ఈ ఆలయంలో స్వామివారికి అందించే నైవేద్యమేంటో తెలిస్తే..

కొన్ని ఆలయాలు వెరీ వెరీ స్పెషల్. కొన్ని సైన్స్‌కి అందని రహస్యాలతో ప్రత్యేకమైతే.. మరికొన్ని ఆలయాలు వింత సంప్రదాయాల కారణంగా ప్రత్యేకంగా మారాయి. వింత ఆచారాల కారణంగా ప్రసిద్ధిగాంచిన ఓ ఆలయం కేరళలో ఉంది. ఇక్కడ వింత సంప్రదాయాలు తరతరాలుగా వస్తున్నాయి. అక్కడి వారు ఈ సంప్రదాయాలు అత్యంత భక్తి శ్రద్ధలతో పాటిస్తూ ఉంటారు. కాబట్టి కేరళ సందర్శనకు వెళితే మాత్రం తప్పనిసరిగా ప్రతి ఆలయాన్ని కచ్చితంగా దర్శించి తీరాలి. ఇక ఇప్పుడు మనం చెప్పుకునే ఆలయం ఎక్కడుంది? దాని ప్రత్యేకతేంటో తెలుసుకుందాం.

కేరళలోని కన్నూర్ జిల్లాలో వలపట్టణం నది ఒడ్డున పరాస్సిని మడప్పుర శ్రీ ముత్తప్పన్ ఆలయం ఉంది. ఇక్కడ శివుని అవతారంగా భావించే శ్రీ ముత్తప్పన్ కొలువై ఉన్నాడు. భగవంతుడు అన్నాక నైవేద్యం కామన్ కదా. ఇక్కడ ముత్తప్పన్‌కు కూడా నైవేద్యం పెడతారు. అయితే అన్ని ఆలయాల మాదిరిగా పులిహోర, దద్దోజనం వంటివి కాదండోయ్.. అదే ఇక్కడి స్పెషల్. నైవేద్యం స్పెషలేంటని అనుకుంటున్నారా? దేవుడికి అత్యంత భక్తి శ్రద్ధలతో చేపలు, కల్లును నైవేద్యంగా సమర్పిస్తారు. అంతేకాదు.. కుక్కలను పవిత్రంగా భావించి భగవంతుడికి అందించినట్టుగా భక్తి శ్రద్ధలతో ఆహారాన్ని అందిస్తారు.

Share this post with your friends