ఈ ఆలయ ప్రత్యేకతేంటో తెలిస్తే క్షణం ఆలస్యం చేయక దర్శనానికి వెళతారు..

భారతదేశంలో ప్రతి ఊరికీ కనీసం ఒక్కటైనా దేవాలయం కనిపిస్తుంది. అయితే వాటిలో కొన్ని దేవాలయాలు చాలా ప్రత్యేకం. అలాంటి ప్రత్యేకత కలిగిన ఆలయాల్లో మహాలక్ష్మీ ఆలయం ఒకటి. ఈ ఆలయ విశేషమేంటో తెలిస్తే దానికి పరుగులు తీస్తారు. అసలు ఆ ఆలయమేంటి? ఎక్కడుంది? దాని ప్రత్యేకతేంటో తెలుసుకుందాం. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు ఆనుకుని ఉన్న రత్లాం జిల్లాలోని మనక్ ప్రాంతంలో మహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో ఉంది. ఇక్కడ భక్తులకు పంచె నైవేద్యం చాలా చాలా స్పెషల్.

ఇక్కడ నైవేద్యంగా భక్తులకు పండ్లు, స్వీట్లు, ఇతర ఆహార పదార్థాలకు బదులు బంగారం, వెండిని కూడా భక్తులకు పంచుతారు. ఈ ఆలయంలో ఈ ఆచారం ఈనాటిది కాదు.. కొన్ని శతాబ్దాలుగా కొనసాగుతోంది. ఇక్కడి అమ్మవారిని దర్శించుకుని చాలా మంది డబ్బు, బంగారం, వెండి, వజ్రాలు వంటి వాటిని సమర్పిస్తారు. దీపావళి సందర్భంగా మహాలక్ష్మి దేవిని మనం కొలుచుకుంటాం. ఈ నేపథ్యంలో ఇక్కడి అమ్మవారిని కరెన్సీ నోట్ల కట్టలు, పువ్వులకు బదులుగా బంగారు, వెండి ఆభరణాలతో అలంకరిస్తారు. అనంతరం ఆలయానికి వచ్చే భక్తులకు కరెన్సీ నోట్లు, బంగారం, వెండి, వజ్రాలను నైవేద్యంగా అందజేస్తారు.

Share this post with your friends