
ప్రతి సంవత్సరం దసరా పండుగను ఆశ్వయుజమాసంలోని శుక్ల పక్షంలోని పదవ రోజున జరుపుకుంటారు. ఈ క్రమంలోనే నేడు దేశమంతా దసరా పండుగను జరుపుకుంటోంది. పురాణాల ప్రకారం ఆశ్వయుజమాసం శుక్ల పక్షం పదవ రోజున శ్రీరాముడు రావణుని సంహరించాడని అంటారు. అందుకే ఈ పండుగనాడు రావణుడితో పాటు మేఘనాథుడు, కుంభకర్ణుడి దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. అయితే కాన్పూర్‌లోని ఓ ఆలయాన్ని పదసరా పండుగ రోజు మాత్రమే తెరుస్తారు. మరి ఆ ఒక్కరోజు ఎవరిని పూజిస్తారో తెలిస్తే షాకవుతారు. ఆ ఆలయ కథేంటో తెలుసుకుందాం.
కాన్పూర్‌లోని ఖాస్ బజార్, శివాల, పట్కాపూర్‌లో ఉంది ఉన్న ఆలయం ఎవరిదో కాదు.. రావణాసురుడి ఆలయం. దీనిని 1868లో మహారాజ్ గురు ప్రసాద్ నిర్మించారు. దసరా రోజున దేశ వ్యాప్తంగా రావణుడి దిష్టిబొమ్మను దహనం చేస్తే ఈ ఆలయంలో మాత్రం ఈ ఒక్కరోజున ఆలయాన్ని తెరిచి రావణుడిని పూజిస్తారు. దీనికి కారణం.. రావణుడు గొప్ప పండితుడు మాత్రమే కాకుండా దైవిక శక్తులు కలిగి ఉన్నాడని వీరంతా నమ్ముతారు. అందుకే ఇక్కడి ఆలయంలో తెల్లవారుజాము నుంచే రావణుడికి పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.
