మాస శివరాత్రి, సోమవారంతో పాటు ఈ రోజుకి ఉన్న విశిష్టతలేంటో తెలిస్తే…

మాస శివరాత్రి, సోమవారం రెండూ శివునికి ఇష్టమైన రోజులే. ఈ రెండూ కలిసొస్తే ఇంకెంత మహత్తరంగా ఉంటుంది. ఈసారి చైత్ర మాస మాస శివరాత్రి సోమవారం వచ్చింది. అంతేకాకుండా మాస శివరాత్రి అయిన ఈ రోజున ప్రీతి యోగా, ఆయుష్మాన్ యోగాలు సైతం ఉన్నాయి. ఇన్ని ప్రత్యేకతలను కలుపుకుని మరీ మాస శివరాత్రి వచ్చింది. కాబట్టి ఈ పవిత్రమైన యోగాలతో పూజలు, ప్రార్థనలు, ఉపవాసాల వంటివి చేస్తే ఫలితం మరింత ప్రభావవంతంగా ఉంటుంది. శివయ్య అత్యంత సంతుష్టుడవుతాడట. ప్రతినెలా కృష్ణ పక్షం చతుర్దశి రోజున మాస శివరాత్రి ఉపవాసం ఉంటూ వస్తారు. ఇలా చేయడం వల్ల కోరిన కోరికను శివుడు నెరవేరుస్తాడని నమ్మకం.

మరి మాస శివరాత్రి ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుందంటారా? చైత్ర మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే చతుర్దశి తిథి మే 6వ తేదీ సోమవారం మధ్యాహ్నం 2:40 గంటలకు ప్రారంభమై.. ఈ తిథి మే 7వ తేదీ మంగళవారం ఉదయం 11:40 గంటలకు ముగుస్తుంది. కనుక ఉదయ తిథి ప్రకారం సోమవారం మాస శివరాత్రి ఉపవాసం చేస్తారు. పూజకు స్వామివారికి ఇష్టమైన బిత్వపత్రాలతో పాటు అభిషేకం కోసం తేనె, దేశీ నెయ్యి, పెరుగు, ఉమ్మెత్త పువ్వులు, పువ్వులు, విభూతి, చందనం, దీపం, పూజ పాత్రలు, గంగాజలంస్వచ్ఛమైన నీటిని వినియోగిస్తారు. ఈ రోజున ఉపవాసముండి.. పంచామృతంతో శివుడిని అభిషేకించి.. చందన తిలకం దిద్దాలి. ఆపై ఆవు నెయ్యితో దీపం వెలిగించి బియ్యంతో పాయసం చేసి నైవేద్యం పెట్టాలి. అలాగే ఈ రోజున మృత్యంజయ మంత్రాన్ని జపిస్తే అకాల మృత్యువు దరి చేరదట.

Share this post with your friends