అయోధ్య రామయ్యను చూడాలన్న ఆ సెక్యూరిటీ గార్డ్ కల ఎలా నెరవేరిందో తెలిస్తే..

అయోధ్య రామయ్యను చూడాలని ఎవరికి ఉండదు? కానీ అందరికీ ఆ కల నెరవేరుతుందా? ముఖ్యంగా దానికి డబ్బులుండాలి. అందరి వద్దా అంత డబ్బు ఉండటం కష్టమే. అయితే ఓ సెక్యూరిటీ గార్డు కూడా అయోధ్య రామయ్యను చూడాలని ఎంతగానో ఆశపడ్డాడు. అందుకు డబ్బు లేక ఆగిపోయాడు. ఆ తరువాత టైం కలిసొచ్చింది ఫ్లైట్‌లో వెళ్లి మరీ స్వామివారిని దర్శించుకుని వచ్చాడు. తాజాగా నెట్టింట ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ యువకుడు తన అపార్ట్‌మెంటు సెక్యూరిటీ గార్డు దగ్గరకు వెళ్లి నీ వయసెంత అని అడిగాడు. 65 ఏళ్లని తెలిపాడు. ఈ వయసులో ఎందుకు ఇంత కష్టపడుతున్నావంటే తన కొడుకు వదిలేశాడని చెప్పాడు.

అయితే నేనే నీ కొడుకుని అనుకో.. నీ కోరికేంటో చెప్పు. అది నేను నెరవేరుస్తానని చెప్పాడు. దానికి ఆ సెక్యూరిటీ గార్డు సున్నితంగా తిరస్కరించాడు. కానీ ఆ యువకుడు బలవంతం చేయగా తనకు అయోధ్య రామయ్యను చూడాలని ఉందని చెప్పాడు. అంతే.. ఆ యువకుడు తనకు, సెక్యూరిటీ గార్డుకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాడు. సెక్యూరిటీ గార్డును బట్టలు సర్దుకోమని చెప్పి.. తీసుకెళ్లి సర్‌ప్రైజింగ్‌గా ఫ్లైట్‌లో తీసుకెళ్లి మరీ అయోధ్య రామయ్యను చూపించాడు. భక్తి భావంతో బాల రామయ్యను దర్శించుకున్న ఆ సెక్యూరిటీ గార్డు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆ యువకుడిపై నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Share this post with your friends