రాజస్థాన్‌లోని బార్మర్ నుంచి 35 కి.మీ దూరంలో, థార్ ఎడారి సమీపంలో ఉన్న పట్టణంలో ఐదు దేవాలయాలున్నాయని తెలుసుకున్నాం కదా. ఇప్పటికే బార్మర్ కొండపై ఉన్న రెండు ఆలయాల గురించి తెలుసుకున్నాం కదా.. ఇప్పుడు మిగిలిన మూడు ఆలయాల గురించి తెలుసుకుందాం. 3వ శతాబ్దంలో నిర్మించబడిన అతి పురాతన ఆలయం శ్రీ నకోడ జైన్ దైవాలయం. ఈ ఆలయాన్ని చాలా సార్లు పునర్నిర్మాణం జరిగింది. ఈ ఆలయాన్ని 13వ శతాబ్దంలో ఆలంషా ఆక్రమించి దోచుకున్నాడు. అయితే ఈ ఆలయంలోని విగ్రహాన్ని స్థానికులు దాచడంతో ఆలంషాకు చిక్కలేదు. ఆ తరువాత 15వ శతాబ్దంలో విగ్రహం తిరిగి తీసుకొచ్చి ఆలయాన్ని పునరుద్ధరించారు.
ఈ ఆలయాల్లో మిగిలిన రెండు దేవాలయాల్లో ఒకటి.. దేవక-సూర్య దేవాలయం. ఈ ఆలయాన్ని 12వ లేదా 13వ శతాబ్దంలో బార్మర్ నుండి 62 కి.మీ.ల దూరంలో బార్మర్-జైసల్మేర్ రోడ్డు వెంబడి ఉన్న దేవ్కా అనే చిన్న గ్రామంలో ఉన్న ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఈ ఆలయం అద్భుతమైన వాస్తుశిల్పకళకు నిలువెత్తు నిదర్శనం. ఈ గ్రామంలో గణేశుడి రాతి శిల్పాలున్న మరో రెండు దేవాలయాల శిధిలాలు కూడా ఉన్నాయి. జసోల్‌లో రాణి భటియాని అనే ఆలయం ఉంది. రాణి భటియాని మంగనియార్‌కు దివ్య దర్శనం ఇచ్చినట్లు చెబుతారు. కాబట్టి రాణి భటియాని.. మంగనియర్ బార్డ్ కమ్యూనిటీ ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ దేవతను మజిసా లేదా తల్లి అని కూడా పిలుస్తారు. రాజపుత్ర రాణి అయిన ఆమె తర్వాతి కాలంలో దేవతగా మారిందట.