ఈ శివాలయంలోని మిస్టరీ ఏంటో తెలిస్తే..

భారతదేశంలో హిందూ సంస్కృతి సంప్రదాయాలకు పుట్టిల్లు. ఇక్కడ ఎన్నో పురాతన దేవాలయాలున్నాయి. ఈ ఆలయాల్లో చాలా మిస్టీరియస్ ఆలయాలున్నాయి. శాస్త్రవేత్తలకు సైతం సవాలుగా మారుతున్నాయి. అలా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మిస్టరీ శివాలయం ఆంధ్రప్రదేశ్‌లోనూ ఒకటుంది. ఈ ఆలయంలో ఆసక్తికర విషయం ఏంటంటే.. నందీశ్వరుడి విగ్రహం నిరంతరం పెరుగుతూనే ఉంటుదట. వినడానికి విచిత్రంగా అనిపించినా కూడా ఇది నిజమని చెబుతారు. ఈ విగ్రహం పరిమాణం అసలు ఎందుకు పెరుగుతోందనే రహస్యాన్ని కనుక్కోవడానికి ఎంతోమంది శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. కానీ అది జరగలేదు.

అసలు ఈ ఆలయం ఏపీలో ఎక్కడుంది? అనేది తెలుసుకుందాం. మిస్టరీ శివాలయం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులోని యాగంటిలో ఉంది. ఈ ఆలయంలో శివుడు కొలువై ఉన్నాడు. ఇక్కడ కొలువైన శివయ్యను ఉమామహేశ్వరుడని పిలుస్తారు. ఈ ఆలయాన్ని యాగంటి ఉమా మహేశ్వరాలయం అని పిలుస్తారు. ఇది 15వ శతాబ్దంలో నిర్మితమైంది. విజయనగర సామ్రాజ్యంలోని సంగం రాజవంశానికి చెందిన రాజు హరిహర బుక్క రాయలు దీనిని నిర్మించారు. ఇది పురాతన కాలం నాటి పల్లవ, చోళ, చాళుక్య , విజయనగర రాజుల సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలుస్తుందని చెబుతారు. ఈ విగ్రహం గురించి పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి తన కాలజ్ఞానంలో కూడా ఉందని చెబుతారు.

Share this post with your friends