అక్షయ తృతీయ పండుగను జరుపుకోవడానికి హిందువులంతా సిద్ధమవుతున్నారు. అయితే అక్షయ తృతీయను జరుపుకోవాలనుకునే వారంతా తప్పనిసరిగా కొన్ని నియమాలను అయితే పాటించాలి. ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజిస్తాం. అయితే అమ్మవారిని పూజించడానికి ముందు ఇంట్లో కొన్ని వస్తువులను లేకుండా చూడాలి. ఇంట్లో ఆ వస్తువులను ఉంచుకుని పూజలు నిర్వహిస్తే అనేక ఇబ్బందులు ఎదురవుతాయట. ఏదైనా పండుగ వస్తుందంటే చాలు.. ముందుగా మనం చేసే పని ఇల్లంతా శుభ్రం చేసుకోవడం. అలాగే ప్రతికూల వస్తువులను ఇంటి నుంచి తీసివేయడం వంటివి చేస్తుంటాం.
అలాగే అక్షయ తృతీయ సమయంలో కూడా ముందుగా చేయాల్సిన పని.. వాస్తు దోషాలను తొలగించే కొన్ని వస్తువులను తొలగించాలి. హిందూ మతంలో చీపురును లక్ష్మీదేవి రూపంగా చూస్తుంటా. ఇంట్లో చీపురు ఉండటం వల్ల కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు ఉంటుందని చెబుతారు. కాబట్టి అరిగిపోయిన, విరిగిన చీపురును ఇంట్లో ఉంచితే.. దీని వల్ల జీవితంలో అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎండిపోయిన మొక్కలను సైతం ఇంటి నుంచి తీసేయాలి. ఎండిపోయిన మొక్కల కారణంగా వాస్తు దోషాలు తద్వారా ఆర్థిక కష్టాలు ఎదురవుతాయట. పాడైపోయిన బూట్లు, చెప్పులను పడేయాలి. పగిలిన గడియారం ఉంటే తీసేయండి.