ఈ ఆలయాలకు వెళితే మీరు ఫుల్ ఖుషీ అయి కానీ తిరిగి రారు..

మనకు ప్రసాదం అనగానే ముందుగా గుర్తొచ్చేది తిరుమల. దేశంలోనే అత్యంత ధనిక దేవాలయం. ప్రసాదంలోనూ టాప్‌లో ఉంటుంది. ఇక్కడ స్వామివారి లడ్డూకి ఉన్న మహత్యమేంటో కానీ ఆ రుచి నభూతో నభవిష్యత్. ఇక ఆ తరువాత మనకు గుర్తొచ్చేది అన్నవరం సత్యనారాయణ స్వామివారి ఆలయం. స్వామివారి ప్రసాదాన్ని గోధుమ నూకతో తయారు చేస్తారు. ఇది కూడా తిని తరించాల్సిందే. ఇక ఇవేనా అంటే.. మనకు తెలియని ఆలయాలు కొన్ని ఉన్నాయి. అక్కడి ప్రసాదం కూడా అద్భుతం అవేంటో చూద్దాం. ఇక తమిళనాడులోని కోయంబత్తూరుకు ఆగ్నేయంగా 150 కిలోమీటర్ల దూరంలో పళనిలో ఉన్న మురుగన్ దేవాలయం. ఈ ఆలయంలో పంచామృతం అరుల్మిగు దండాయుధపాణి స్వామి కొలువై ఉన్నాడు. ప్రసాదానికి భౌగోళిక సూచిక ట్యాగ్ అందుకున్న భారతదేశంలోని ఏకైక హిందూ దేవాలయం ఇదే. అరటిపండ్లు, ఆవు నెయ్యి, బెల్లం, తేనె , యాలకులతో ప్రసాదం తయారు చేస్తారు. దీనిని తిని తరించాల్సిందే.

పూరి జగన్నాథుడికి 56 రకాల ఆహార పదార్తాలను నిత్య నైవేద్యంగా సమర్పిస్తారు. దీనినంతటినీ మట్టి కుండలోనే చేస్తారు. అందుకో ఏమో కానీ ఇక్కడి ప్రసాదం అద్భుతంగ ఉంటుంది. ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఇక్కడ ప్రసాదానికి లోటుండదట. అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్. ఈ ఆలయం సేవా స్ఫూర్తికి కేరాఫ్ అని చెప్పవచ్చు. ఇక్కడి లంగర్‌లో ప్రతిరోజూ ప్రసాదం అందిస్తూ ఉంటారు. వీరు చాలా ప్రేమగా పెట్టే ప్రసాదం, భోజనం మనకు కడుపు నింపడమే కాదు.. సంతోషాన్ని కూడా ఇస్తుంది. ఇక షిర్డీ సాయిబాబా ప్రసాదం. ఇక్కడ లడ్డూ, రసోయి ప్రసాదాలను అందిస్తూ ఉంటారు. ఇది చాలా రుచిగా ఉంటాయి. ఆసియాలోనే అతిపెద్ద సౌరశక్తితో పనిచేసే వంటగది షిర్డీలోనే ఉంది. ఈ ఆలయాలన్నింటికీ వెళితే మంచిగా ప్రసాదం తిని తృప్తిగా కానీ తిరిగి రారు.

Share this post with your friends