ఉత్తరాఖండ్‌లోని పితోరాఘర్‌లో ఉన్న పాతాళ భువనేశ్వర గుహ గురించి ఇప్పటికే మనం కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకున్నాం. ఇంకా ఇక్కడ మరికొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకునేవి ఉన్నాయి. కాలభైరవుడు, బ్రహ్మకమలం కూడా ఈ గుహలో ఉంటాయి. వీటి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. పాతాళ భువనేశ్వర గుహలో కాల భైరవుని నాలుక మనకు కనిపిస్తుంది. ఇక్కడి కాల భైరవుడి నోటి నుంచి గర్భంలోకి ప్రవేశించి.. చివరి వరకూ చేరుకున్నవారికి మోక్షం తప్పక లభిస్తుందని నమ్మకం. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ గుహలో బ్రహ్మకమలాలు కూడా ఉంటాయి.
గణేషుడి రాతి విగ్రహమే బ్రహ్మ కమలాల మధ్య ఉంటుంది. ఒకటీ అరా కాదండోయ్.. 108 బ్రహ్మకమలాల మధ్య గణేషఉడు ఉంటాడు. బ్రహ్మకమలం నుంచి నీటి చుక్కలు వినాయకుడి తలపై నిత్యం పడుతూ ఉంటాయి. గుహలోకి బ్రహ్మ కమలం ఎలా వచ్చిందని అంటారా? పరమేశ్వరుడే ఈ బ్రహ్మకమలాలను పెట్టారని అంటారు. త్రేతాయుగంలో అయోధ్యలోని సూర్యవంశ రాజు ఋతుపర్ణ ఒకసారి అడవి జింకను వేటాడుతూ ఈ గుహ ముందుకు వచ్చాడట. ఆ గుహ ఏంటని చూసిన ఋతుపర్ణకు సకల దేవతలతో కొలువైన శివయ్య కనిపించాడట. అలా ఋతుపర్ణ ఈ గుహను కనుగొన్నాడని చెబుతారు.