కొన్ని పనులు చాలా జాగ్రత్తగా చేయాలి. ఇంట్లో బీరువాను ఏ దిక్కులో పెట్టాలి. పూజగదిని ఏ దిక్కులో ఏర్పాటు చేసుకోవాలి వంటివి. ఇక భోజనం విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలి. భోజనం ఏ దిక్కులో కూర్చొని చేస్తే మనకు అన్ని విధాలుగా బాగుంటుందనేది తెలుసుకోవాలి. వాస్తు ప్రకారం తూర్పుదిక్కున, ఉత్తర దిక్కులలో కూర్చుని భోజనం చేయడం ఉత్తమమని భావిస్తారు. దీనికి ఒక కారణముంది. అదేంటంటే.. తూర్పు, ఉత్తర దిక్కులు దేవుడికి నిలయమట. ఈ దిక్కులలో కూర్చొని భోజనం చేస్తే మనపై దేవుడి అనుగ్రహం తప్పక ఉంటుందట.
ఈ రెండు దిక్కులలో కూర్చొని భోజనం చేయడం వల్ల మన ఆయుర్దాయం పెరుగుతుందట. అలాగే డైనింగ్ టేబుల్‌ని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలంటే.. దక్షిణ లేదా పడమర గోడ వైపు వేసుకోవాలట. వాస్తు ప్రకారం దక్షిణ దిక్కును యమ దిక్కుగా పరిగణిస్తారు. కాబట్టి ఈ దిక్కున కూర్చొని భోజనం చేయడం అస్సలు మంచిది కాదట. ఈ దిక్కున కూర్చొని తింటే మన ఆయుర్దాయం తగ్గుతుందట. పైగా ఏం చేసినా కలిసి రాదట. ఇక పశ్చిమ దిక్కు వచ్చేసి భోజనానికి అస్సలు సరికాదట. ఈ దిక్కున కూర్చొని భోజనం చేయడం వల్ల అప్పులు పెరిగి జీవితం ఇబ్బందికరంగా మారుతుందట.