ఇలా చేస్తే చాలు.. కష్టాల నుంచి అలా గట్టెక్కుతామట..

కొన్ని సందర్భాల్లో మన ప్రమేయం లేకుండానే ఊహించని ఆపదల్లో చిక్కుకుంటాం. ఆ సమయంలో ఏం చేయాలనేది మనసుకి తట్టదు. గందగోళానికి గురవుతాం. ఆపదలు సంభవించిన క్లిష్టమైన సమయంలో రక్షించే హనుమ జయ మంత్రం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. తలపెట్టిన ప్రతీ కార్యం ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా కొనసాగాలన్నా, ఆపదల నుంచి బయటపడాలన్నా ఓ పని చేయాలి. అదేంటో తెలుసుకుందాం. ఆపదలో ఉన్నప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు మనసు ఆలోచన లేకుండా స్తంభించిపోయినప్పుడు జయ మంత్రాన్ని పఠిస్తే పరిస్థితులన్నీ సాధారణ స్థితికి వచ్చేస్తాయట.

అలాంటి సమయంలో ఆంజనేయ స్వామికి ఒక్క కొబ్బరి కాయ, పంచదారను నివేదిస్తే చాలు. మన కష్టాలన్నీ తొలుగుతాయట. ఈ విషయాన్ని వాల్మీకి రచించిన రామాయణంలోని సుందరకాండలో వివరించడం జరిగింది. ఎంత కఠినమైన సమస్యలు మనల్ని చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిర చేసినా జయమంత్రాన్ని పఠిస్తే మనసు తేలిక పడి.. ఇబ్బందుల నుంచి బయటపడే దారి కనిపిస్తుందట. సమస్యలన్నీ తొలగిపోయిన తరువాత చిన్న పని చేయాల్సి ఉంటుంది. అదేంటంటే.. చిన్న పిల్లలకు పానకం, వడపప్పు పంచాలట. అంతే హనుమంతుడు ఉప్పొంగిపోతాడట. మనకు అండగా నిలుస్తాడట.

Share this post with your friends