హిందూ కుటుంబాల్లో నిత్యం పూజలు నిర్వహించడం ఆనవాయితీ. అయితే పూజా విధానం ఎలా అయితే తెలిసి ఉండాలో అలాగే పూజకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకుని నిర్వహించడం మంచిది. ఏ తప్పు లేకుండా చేస్తూ పూజ సంపూర్ణం అవుతుంది. పూజ గదిలో ఏ ఏ దేవుళ్లకు సంబంధించిన ఫోటోలు ఉండాలి? నుంచి ప్రతి ఒక్క విషయం తెలుసుకోవాలి. మనం తెలిసో తెలియకో చేసే పొరపాట్లను సరిదిద్దుకుంటే అంతా మంచే జరుగుతుంది. ప్రస్తుతం పూజ గదిలో కొన్ని వస్తువులను వాడుతూ ఉంటాం. వాటి విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలట. అవేంటో తెలుసుకుందాం.
ఇంట్లోని పూజ గదిలో లోహంతో తయారైన వస్తువులను ముఖ్యంగా వాడకూడదట. అలాగే మనం దేవుడి పూజకు అల్యూమినియం పాత్రలను సైతం వాడుతూ ఉంటాం. ఇవి అస్సలు వాడకూడదట. దీపాలు మొదలు దేవుడి నైవేద్యం వండే పాత్రల వరకూ అల్యూమినియం వాడకూడదట. వీటిని అంత శుభంగా పరిగణించరట. ఇక వీటితో పాటు పూజ గదిలో స్టీలు వస్తువులు సైతం వాడుతూ ఉంటాం. వీటిని కూడా అసలు వాడకూడదట. లోహంతో తయారు చేసిన పాత్రలు గాలి లేదంటే తడి తగిలితే పాడై పోతాయి. కాబట్టి వీటిని వాడకూడదట. పూజకు వినియోగించే పాత్రలు ఎప్పుడూ కళగా ఉండాలి కాబట్టి ఇత్తడి పాత్రలు వాడుకోవడం ఉత్తమమని చెబుతారు. వీలైతే వెండిని కూడా వాడవచ్చు.